/rtv/media/media_files/2024/12/29/FfuQlxNMvLIdfi5IMXpX.jpg)
CM Chandrababu Naidu
తన కుమారుడు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ అతనికి వ్యాపారమే బాగా సూట్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం అతనికి అందులో సంతృప్తి పొందుతున్నారు. అంతేకానీ తన వారసత్వం ఏమీ లేదని స్పష్టం చేశారు. వ్యాపారం , రాజకీయాలు, సినిమాలు ఏదైనా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితుల వలన కేవలం అవకాశాలు మాత్రమే వస్తాయి. దావోస్ పర్యటనలో భాగంగా ‘ఇండియా టుడే’, ‘బ్లూమ్‌బర్గ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తానెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 33 ఏళ్ళ క్రితం వ్యాపారం మొదలుపెట్టా. అది బాగా నడుస్తోంది కూడా అని చెప్పుకొచ్చారు.
కక్ష సాధించే ఉద్దేశ్యం లేదు..
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్ళారు. దీనిపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఇలా సమాధానం చెప్పారు. తనను ఇబ్బంది పెట్టారు కదా అని తానేమీ వారి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని అనుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో చాలా అవినీతి, అక్రమాలు జరిగాయి. వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాము. ఎవరు తప్పు చేసినా చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. జగన్ పై ఇప్పుడు కొత్తగా ఏమీ కేసులు పెట్టనక్కర్లేదు. ఎప్పటి నుంచో అతని మీద కేసులు నడుస్తున్నాయని అన్నారు.
Also Read: Hezbollah Commander:ఇంటి ముందే హెజ్‌బొల్లా కమాండర్ దారుణ హత్య!
ఇక కేంద్రంలో నాలుగోసారి కూడా మోదీనే ప్రధాని అవుతారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన వల్లనే సుస్థిర ప్రభుత్వం ఉంటుందని...అభివృద్ధి దాని ద్వారానే వస్తుందని ఆయన అన్నారు. తానేమీ కేంద్ర మంత్రిగా వెళ్ళాలని అనుకోవడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితం అయినా..రాజకీయాలైనా విలువలు ఉండాలి. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరి ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణం.. అని చంద్రబాబు చెప్పారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అనే ప్రశ్నకు సమాధానంగా ఎవరైనా ప్రజల్ని ఒకసారి మాత్రమే మోసం చేయగలరు.. ఎప్పుడూ కాదు అని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఏపీలో ఎంతో విధ్వంసం జరిగింది. ఇప్పుడు దాన్ని బాగుచేయడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. దీనికి కేంద్రం నుంచి కూడా సహాయం అందుతోందని తెలిపారు.
Also Read: Horoscope Today: నేడు ఈ 2 రాశులవారికి మనోబలం ఎక్కువగా ఉంటుంది...ఈ రాశుల వారికి అయితే..!