/rtv/media/media_files/2024/11/09/EpBNuv55XLiPRqBHwwUG.jpg)
రష్యా అధ్యక్షుడు పుతిన్ చల్లని కబురు చేప్పినట్టే చెప్పి మళ్ళీ దానికి ఓ కండిషన్ పెట్టారు. ఎప్పుడెప్పుడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా అని చూసివాళ్ళకు శుభవార్త చెప్పారు. కాల్పుల విరమణకు ఆదేశాలు జారీ చేశారు. ఇది విని రెండు దేశాల వాళ్ళూ హమ్మయ్యా అనుకునే లోపే గుడ్ న్యూస్ తో పాటూ బాంబ్ ను కూడా పేల్చారు. కాల్పుల విరమణ ఉంటుంది కానీ ఒక్క రోజే అంటూ సంచలన ప్రకటన చేశారు. ఈస్టర్ సందర్భంగా కాల్పుల విరమణ ఇచ్చిన ఆయన అది కేవలం శనివారం సాయంత్రం 6గంటల నుంచి ఆదివారం అర్థరాత్రి వరకు మాత్రమే అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ ప్రకటనను ఆయన రష్యా సైనిక ప్రధానాధికారి వాలెరీ గెరాసిమోవ్‌తో జరిగిన సమావేశం తర్వాత తెలిపారు.
కేవలం 30 గంటలు మాత్రమే..
ఈ ఒక్క రోజు అన్ని రకాల యుద్ధ చర్యలూ ఆపాలని పుతిన్ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. పైగా ఉక్రెయిన్ కూడా ఇందుకు సహకరించాలని కోరారు. అయితే శత్రువులు ఎలాంటి దాడి చేసినా లేదా ఉల్లంఘనలకు పాల్పడినా సైన్యం అప్రమత్తంగా ఉండాలని పుతిన్ మళ్ళీ సూచనలు కూడా చేశారు. అయితే దీని మీద ఉక్రెయిన్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
మరోవైపు అమెరికా ఎంత చెబుతున్నా రష్యా అధ్యక్షుడు శాశ్వత యుద్ధ విరమణకు సంసిద్ధత ప్రకటించడం లేదు. అసలు చర్చలకే సహకరించడం లేదు. శుక్రవారం అమెరికా, తగిన పురోగతి కనిపించకపోతే శాంతి ప్రయత్నాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. అయినా కూడా రష్యాలో కదలిక ఏ మాత్రం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలుగజేసుకోవడంతో మధ్యలో కాల్పుల విరమణ చేస్తామని రష్యా చెప్పింది. కానీ మాట మీద నిలబడలేదు. అలా చెప్పి ఇలా మరోవైపు నుంచి కాల్పులు, దాడులకు తెగబడుతూనే ఉంది. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. ఆ రోజు రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్ మీదకు దాడికి పంపించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొంతకాలంగా సమస్యలు కొనసాగుతుండగా, 2022లో రష్యా ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించేందుకు ప్రయత్నించింది. దీంతో అప్పటి నుంచి యుద్ధం మూడేళ్ళుగా జరుగుతూనే ఉంది.
today-latest-news-in-telugu | russia | ukraine | war | festival
Also Read: 14 ఏళ్ళు ముఖ్యమంత్రి..45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం..అనితరసాధ్యుడు చంద్రబాబు