Egypt: సీజ్ ఫైర్ సమ్మిట్ సమీపంలో కారు బోల్తా..ముగ్గురు ఖతార్ డిప్లొమాట్లు మృతి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఈజిప్పులో జరుగుతున్నాయి. ఈ  శిఖరాగ్ర సమావేశానికి వెళుతుండగా కారు ప్రమాదం జరిగి ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మరణించారు. 

New Update
egypt

ఈజిప్ట్ ,అమెరికాతో కలిసి ఖతార్ కూడా గాజా శాంతి ఒప్పందం శిఖరాగ్ర చర్చల్లో పాల్గొంది. ఇక్కడే ఈ మూడు దేశాల దౌత్య వేత్తలు కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించారు. ఈ నెల ప్రారంభంలో షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన చర్చలలో టర్కీ కూడా పాల్గొంది. మొదటి దశ చర్చల్లో కాల్పుల విరమణ ,బందీలు, వందలాది మంది పాలస్తీనా ఖైదీల విడుదల జరిగింది. తదుపరి దశ చర్చలు కూడా ఇక్కడే జరగనున్నాయి.  ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్-ఫత్తా ఎల్-సిస్సీ ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి అధ్యక్షత వహించే ఈ శిఖరాగ్ర సమావేశానికి షర్మ్ ఎల్-షేక్ ఆతిథ్యం ఇస్తారని ఈజిప్టు అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ,ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సహా రెండు డజనుకు పైగా ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని తెలిపారు. 

బోల్తాపడ్డ కారు..ముగ్గురు మృతి

అయితే ఈ సమావేశానికి హాజరవడానికి వస్తున్న ఖతార్ దౌత్యవేత్తల కారు ప్రమాదానికి గురైంది. ఈజిప్టులోని ఎర్ర సముద్రంలోని షర్మ్ ఎల్-షేక్ రిసార్ట్‌కు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. షర్మ్ ఎల్-షేక్ నుండి 50 కిలోమీటర్ల (31 మైళ్ళు) దూరంలో వారి వాహనం బోల్తా పడటంతో ముగ్గురు ఖతార్ డిప్లొమాట్లు చనిపోగా..మరో ఇద్దరు తీవ్ర గాయాలపాల్యారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. 

సోమవారం బందీల విడుదల..

మరోవైపు ఇజ్రయెల్ , హమాస్ సంతకం చేసిన గాజా శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందం ప్రకారం సోమవారం నాడు బందీలను విడుదల చేయనున్నారు. గాజాలో పాలస్తీనా ఉగ్రవాదులు పట్టుకున్న 48 మంది బందీలను విడుదల చేస్తారు. రేపు ఉదయం ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ ఖైదులో ఉన్న పాలస్తీనీయన్ల తుది జాబితాను మాత్రం ఇంకా రెడీ చేస్తున్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. 

Also Read: Delhi: గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..సిద్ధమవుతున్న ఢిల్లీ

Advertisment
తాజా కథనాలు