Mehul Choksi : మెహుల్ చోక్సీ భారత్ కు అప్పగింత..ఒప్పుకున్న బెల్జియం

ఆర్థిక నేరస్తుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించడానికి బెల్జియం కోర్టు అనుమతించింది. అతనిని ఏకాంతంగా నిర్భంధించమని..అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వడంతో దీనికి ఒప్పుకుంది. 

New Update
mehul

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13 వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ చాలా ఏళ్ళుగా బెల్జియంలోనే ఉంటున్నాడు.ఇక్కడి నుంచి పారిపోయిన తర్వాత అతనిని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. అయితే మెహుల్‌ను అప్పగించమని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. కానీ ఇప్పటి వరకు అక్కడి కోర్టు దీనికి ఒప్పుకోలేదు. తాజాగా నిన్న ఫైనల్‌గా బెల్జియం కోర్టు మెహుల్‌ను భారత్ కు అప్పగించడానికి కోర్టు ఒప్పుకుంది. భారత అభ్యర్థన మేరకు ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేయడం సరైన చర్యేనని అక్కడి న్యాయస్థానం చెప్పింది. 

ఏకాంతంగా నిర్భంధించము..

ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆంట్వర్ప్‌లో మెహుల్ ఛోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేశారు. భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థన మేరకు అతనిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మెహుల్ అక్కడే ఉన్నాడు. రీసెంట్‌గా ఆర్థిక నేరగాడు బెయిల్ కు దరఖాస్తు కూడా చేసుకున్నాడు. కానీ బెయిల్ ఇసతే దేశం నుంచి పారిపోతాడనే కారణంగా బెల్జియం కోర్టు దానిని తిరస్కరించింది. అయితే మెహుల్‌కు పై కోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు భారత్ కు అతన్ని అప్పగిస్తుండడంతో దాన్ని కోల్పోనున్నాడు. తమకు అప్పగిస్తే అతడిని ఏకాంతంగా నిర్బంధించమని బెల్జియంకు హామీ ఇచ్చిన భారత్‌.. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ వసతులు కల్పిస్తామని భారత ప్రభుత్వం బెల్జియం కోర్టుకు హామీ ఇవ్వడంతో మెహుల్‌ను అప్పగించడానికి ఒప్పుకుంది.   

Advertisment
తాజా కథనాలు