/rtv/media/media_files/2025/02/16/n0CdJheKOFhOrihiX25H.jpg)
Euphoria musical night In Vijayawada
ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా పేరుతో విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఉన్నంత వరకు..బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్… ఉంటాయని అన్నారు. ఒక విషాదం నుంచి బసవతారకం ఆసుపత్రి బయటకు వచ్చింది. ఎన్టీయార్ అద్భుత సేవా దృక్పథానికి ఇది నిదర్శనం చంద్రబాబు అన్నారు. తాను సీఎం అయ్యాక ఈ ఆసుపత్రిని ఇంకా బాగా అభివృద్ధి చేశానని తెలిపారు. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రిని.. భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ని వారి తల్లిదండ్రుల పేరుతో కొనసాగిస్తూ..సేవ చేస్తున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ సేవా భావంలో ముందు ఉండేవారని చంద్రబాబు పొగిడారు. ఎన్టీయార్ ను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
పవన్ రూ .50 లక్షలు విరాళం...
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్టీయార్ ట్రస్ట్ కు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. తాను టికెట్ కొనకుండా మ్యూజికల్ నైట్ కు హాజరయ్యాయని అందుకే విరాళాన్ని ప్రకటిస్తున్నానని తెలిపారు. నటనకే పరిమితం కాక బాలయ్య సేవా కార్యక్రమాలతో ఎంతో పేరు తెచ్చుకున్నారని పవన్ అన్నారు. బాలయ్య ఎప్పుడూ తనను బాలయ్యా అని పిలవమని అంటుంటారని.. కానీ తనకు మాత్రం అలా పిలవబుద్ధి కాదని.. ఆయన తనకు ఎప్పుడూ సారే అని పవన్ అన్నారు. 28 ఏళ్లుగా ఎన్టీయార్ ట్రస్ట్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని.. పబ్లిసిటీ లేకుండా సైలెంటుగా తమ పని తాము చేసుకుపోతుంటారని పవన్ చెప్పుకొచ్చారు. అందుకే బాలయ్య అంటే తనకు ఎనలేని గౌరవం అని అన్నారు.
మంత్రి లోకేశ్ ...
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే నమ్మకం. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి ఆలోచన, భువనేశ్వరి గారి ఆచరణే ఎన్టీఆర్ ట్రస్ట్ అని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తలసేమియా బాధితులకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. 1997 లో ఒక్క అడుగుతో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రయాణం ప్రారంభమైంది. 28 ఏళ్ల ప్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది ఎన్టీఆర్ ట్రస్ట్. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, సురక్షిత త్రాగునీరు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు ప్రజల మనస్సు గెలుచుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రజల్ని అందరి కంటే ముందు పలకరించేది, సాయం అందించేది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తీ తో మహిళలు సొంత కాళ్ళ పై నిలబడే శక్తిని ఇచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్ అని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. తలసేమియా, జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్న 200 మంది పిల్లలు ట్రస్ట్ నుండి రక్తాన్ని పొందుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ మందులను కూడా అందిస్తోంది. ఇప్పటివరకు 13వేల ఆరోగ్య శిబిరాలు, రూ.23 కోట్ల విలువైన మందులను పంపిణీ చేసింది. ట్రస్ట్ ఆధ్వర్యాన సంజీవని ఆరోగ్య క్లినిక్‌లు, నాలుగు మొబైల్ బస్సులను నడుపుతున్నాం. అవసరమైన వారికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నాం. 2,020 మంది అనాథలు పూర్తిగా ఉచిత వసతి, విద్యను ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోందని లోకేశ్ తెలిపారు.
ఆరోగ్యసేవల్లో మేటి ఎన్టీఆర్ ట్రస్ట్
ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మహమ్మారి బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ సవాలుగా స్వీకరించింది. క్లిష్టమైన సమయంలో అవసరమైన వారికి అండగా నిలచింది. మాస్క్‌లు, మందులు, ఆక్సిజన్‌ను పంపిణీ చేశాం. కోవిద్ బాధితుల ప్రాణాలను రక్షించడానికి ట్రస్ట్ కార్యకర్తలు అహరాహం శ్రమించారు. మా ప్రయత్నాలు అక్కడితో ఆగలేదు. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియల కోసం కూడా మేము సాయం అందించాం. దానాలన్నింటిలో కీలకమైన రక్తదానంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కీలకపాత్ర వహిస్తోంది. ఇప్పటివరకు 8.70 లక్షల మంది రోగులకు రక్తాన్ని అందించడం ద్వారా ట్రస్ట్ లక్షలాది బాధితల ప్రాణాలను కాపాడింది.
Also Read: Breaking: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..