స్పృహ కోల్పోయిన తర్వాతే కాల్పులు.. ఎన్ కౌంటర్ పై డీజీపీ సంచలనం! ములుగు జిల్లా మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై డీజీపీ జితేందర్ సంచలన విషయాలు బయటపెట్టారు. పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులే మొదట కాల్పులు జరిపారని తెలిపారు. విష పదార్థాలు ప్రయోగించి హతమార్చినట్లు వస్తున్న ఆరోపణలు ఖండించారు. By srinivas 02 Dec 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి Encounter: ములుగు జిల్లా మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై డీజీపీ జితేందర్ సంచలన విషయాలు బయటపెట్టారు. విష పదార్థాలు ప్రయోగించి హతమార్చినట్లు వస్తున్న ఆరోపణలు ఖండించారు. స్పృహ కోల్పోయిన తర్వాత కాల్పులు జరిపారని జాతీయ రాష్ట్ర పౌర హక్కుల సంఘం చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఇది పూర్తిగా దుష్ప్రచారమని చెప్పారు. మావోయిస్టులు చేస్తున్న వరుస హత్యలను అపేందుకే ఈ చర్యకు పాల్పడాల్సివచ్చిందని వెల్లడించారు. అందుకే కాల్చి చంపాం.. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన డీజీపీ.. పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులే మొదట కాల్పులు జరిపారని తెలిపారు. దీంతో ఎదురుకాల్పులు జరపాల్సివచ్చిందని, ఇందులో భాగంగానే ప్రాణ నష్టం వాటిల్లిందని చెప్పారు. మావోయిస్టుల దగ్గర అత్యాధునిక ఆయుధాలున్నాయన్నారు. అలాగే ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసిలను రమేష్, అర్జున్‌లను మావోయిస్టులు కత్తులతో పొడిచి చంపేశారని, ఇలాంటి సంఘటనలను జరగకుండా ప్రజలను రక్షించేందుకు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: Water: హైరిస్క్ కేటగిరీలో మినరల్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఇక ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. మృతదేహాల శవ పరీక్షలు హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సూచనల మేరకు జరిపించారు. కేసు దర్యాప్తు అధికారిగా వేరే జిల్లా డీఎస్పీని నియమించామని, దర్యాప్తు జరుగుతుందని డీజీపీ స్పష్టం చేశారు. #jithender-reddy #dgp #maoist-encounter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి