Pakistan: పాకిస్థాన్‌కు బిగ్‌ షాక్.. 11 మంది సైనికులు మృతి

పాకిస్థాన్‌లో మళ్లీ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. సాయుధ బలగాలు వెళ్లే వాహనంపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులతో సహా 11 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

New Update
11 paramilitary troops killed in TTP ambush near Afghan border

11 paramilitary troops killed in TTP ambush near Afghan border

పాకిస్థాన్‌లో మళ్లీ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. సాయుధ బలగాలు వెళ్లే వాహనంపై మిలిటెంట్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులతో సహా 11 మంది పారామిలిటరీ సిబ్బంది మృతి చెందినట్లు తెలుస్తోంది.ఇక వివరాల్లోకి వెళ్తే.. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో కుర్రం జిల్లాలో పాక్‌ సైన్యం కాన్వయ్‌పై మిలిటెంట్లు ఈ దాడులు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం అక్కడి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.  

Also Read: భారత్‌తో యుద్ధం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కానీ ఈ దాడులకు సంబంధించి ఇప్పటిదాకా పాక్‌ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. అయితే తెహ్రీక్ తాలిబన్ పాకిస్థాన్‌ (TTP) ఈ దాడికి తమదే బాధ్యత అని ప్రకటన చేసినట్లు ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు నుంచి టీటీపీ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం పాక్‌కు వ్యతిరేకంగా ఆ దేశ భద్రతా సిబ్బంది, ప్రజలే టార్గెట్‌ ఈ గ్రూప్ ఇంతకుముందు కూడా పలుమార్లు దాడులకు పాల్పడింది.  

Also Read: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ

Advertisment
తాజా కథనాలు