Sunil Gavaskar: ఇండియా-పాక్ టీమ్‌లపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు భారత్-పాక్ టీమ్‌లపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత్-పాక్ టీమ్‌ల బలాలు బలహీనతలపై స్పందించిన గవాస్కర్.. పాకిస్థాన్ టీమ్ బౌలర్లతో గంభీరంగా కన్పిస్తుందని, టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనఫ్‌తో ప్రత్యర్థి టీమ్‌లకు వణుకు పుట్టిస్తోందన్నాడు. By Karthik 19 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి భారత్-పాక్ టీమ్‌లపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత్-పాక్ టీమ్‌ల బలాలు బలహీనతలపై స్పందించిన గవాస్కర్.. పాకిస్థాన్ టీమ్ బౌలర్లతో గంభీరంగా కన్పిస్తుందని, టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనఫ్‌తో ప్రత్యర్థి టీమ్‌లకు వణుకు పుట్టిస్తోందన్నాడు. మరోవైపు ఇటీవల ఆసియా కప్‌లో భారత బౌలర్లను చూస్తే ఒకప్పటి ఆసిస్ టీమ్ గుర్తొచ్చిందన్నారు. ఆసిస్ టీమ్‌లో బ్రెట్‌లీ, మిచెల్ జాన్స్‌లు తమ నిప్పులు చెరిగే బంతుల ముందు ఎంతటి మేటి బ్యాటర్లైనా వికెట్ సమర్పించుకునేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత బౌలింగ్ విభాగం అలానే ఉందని, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆసిస్ బౌలర్లలా కన్పించిందన్నాడు. సిరాజ్, బుమ్రా, మహ్మద్ షమి, వరల్డ్ కప్ టోర్నీలో సైతం తమ ఫామ్‌ను ఇలానే కొనసాగిస్తే కచ్చితంగా కప్ మళ్ళీ భారత్ వశం అయ్యే అవకాశలు అధికంగా ఉన్నాయన్నారు. మరోవైపు పాక్ టీమ్‌లో బౌలర్లకు కొదవలేదన్న గవాస్కర్.. కానీ వారి బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్, కీపర్ రిజ్వాన్‌ల మీదనే పాక్ టీమ్ ఆధారపడి ఉందన్నాడు. వీరిని ఎంత త్వరగా ఫెవీలియన్ పంపితే పాక్‌ను అంత త్వరగా ఆలౌట్ చేసే అవకాశం ఉందన్నాడు. మరోవైపు వరల్డ్ కప్ స్వదేశంలో జరుగుతుండటం యువ ఆటగాళ్లకు కలిసి వచ్చే అంశం అన్నాడు. యువ ఆటగాళ్లు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్‌గిల్ తమ ప్రతిభ వరల్డ్ కప్ టోర్నీలో చూపిస్తే రాబోయే తరానికి భారత జట్టును ముందుకు నడిపించేది వారే అనడంలో అతిశయోక్తి లేదన్నారు. మరోవైపు పంత్ ఈ మెగా టోర్నీలో ఆడకపోవడం వల్ల అతని ఫ్యాన్స్‌తో పాటు భారత ప్లేయర్లు సైతం నిరత్సాహ పడే అంశమన్నాడు. కాగా టీమిండియా అంటే ఇప్పటి వరకు బ్యాటింగ్ టీమ్ మాత్రమే అని స్పిన్నర్‌లపై ఆధార పడే టీమ్ అనే పేరు ఉండేదన్న ఆయన.. ఇకపై భారత పేసర్లను చూసి ప్రత్యర్థి బ్యాటర్లు బయపడుతారని గవాస్కర్ పేర్కొన్నాడు. #pakistan #india #ishan-kishan #shubman-gill #sunil-gavaskar #cricket-teams #batting #bowling #odi-world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి