ద్ర‌వ్యోల్బ‌ణం ఎఫెక్ట్... రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!!

ద్రవ్యోల్బణం మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది. కూరగాయల ధరపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. ద్రవ్యోల్బణ రేటు పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మూడోసారి కూడా రెపోరేటును పెంచడంలేదని స్పష్టం చేశారు.

New Update
ద్ర‌వ్యోల్బ‌ణం ఎఫెక్ట్... రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!!

RBI Key Decision on Repo rate: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) దీనిపై ఇవాళ ప్రకటన చేశారు. ద్రవ్యపరపతి విధానకమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రెపోరేటును 6.5శాతంగానే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వరుసగా మూడోసారి ఇదే రేటును కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ద్రవ్యోల్బణ ఎఫెక్ట్ కూరగాయల ధరలపై చూపనున్నట్లు తెలిపారు. రెపోరేటు యాధాతథంగా ఉంచేందుకు ఆర్బీఐ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

ప్రపంచ మార్కెట్లో ఎదురైతున్న ఒడిదొడుకుల మధ్య ...భారతీయ ఆర్థిక వ్యవస్థ (Indian Economy)  స్థిరంగా బలపడుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి, శక్తికాంత దాస్ మాట్లాడుతూ..2023-24లో, వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా అంచనా వేసినట్లు చెప్పారు. రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2 శాతం, మూడో త్రైమాసికంలో 5.7 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతంగా ఉంటుందన్నారు. జులై, ఆగస్టు నెలల్లో ఆ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని శక్తికాంత్ దాస్ తెలిపారు.

ఇటీవల కాలంలో కూరగాయల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మరోసారి పెరిగింది. ఈ దృష్ట్యా, సెంట్రల్ బ్యాంక్ తన ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతం నుండి 5.4 శాతానికి పెంచింది. టొమాటోలు, ఇతర కూరగాయలు ధరలు పెరగడం కారణంగా...రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ అంచనాను పెంచింది. గురువారం ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ దేశీయ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. ఖరీఫ్ విత్తనాలు, గ్రామీణ డిమాండ్‌లో మెరుగుదల, సేవలలో పెరుగుదల, వినియోగదారుల విశ్వాసం గృహ వినియోగానికి తోడ్పడుతుందని దాస్ చెప్పారు.

అయితే ఇదే సమయంలో కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జులైలో వానాకాలం, ఖరీఫ్‌లో నాట్లు వేయడంలో అద్భుతమైన ప్రగతి కనిపించిందని చెప్పారు. వర్షపాతం అసమాన పంపిణీపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ హెచ్చరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే 2024-25లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా అంచనా వేయబడింది. రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 4.3 శాతంగా ఉండగా, జూన్‌లో 4.8 శాతానికి పెరిగిందని తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరుకున్న తర్వాత..ఆర్బీఐ దానిని నిర్దేశించిన శ్రేణికి తీసుకురావడానికి మే 2022 నుంచి వరుసగా 9సార్లు రెపోరేటును పెంచింది. ఈ కాలంలో ఈ రేటును 250 బెసిస్ పాయింట్లు పెంచింది. అయినప్పటికీ ద్రవ్యోల్బణంపై నియంత్రణతో సెంట్రల్ బ్యాంకు దాని పెరుగుదలకు చెక్ పెట్టింది. ఫిబ్రవరి 2023 నుంచి ఎలాంటి మార్పు లేదు.

ఇక 2022-23లో మన దేశ వాస్తవ జిడిపి వృద్ధి 7.2 శాతంగా ఉందని లోకసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. . 2023-24లో 6.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ అంచనాలను అనేక గ్లోబల్ ఏజెన్సీలు అందించడంతోపాటు.. RBI ప్రొజెక్షన్ కూడా అదే విధంగా ఉందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

publive-image

Also Read: రూ. 15వేల లోపు బెస్ట్ 5జీ మొబైల్స్ ఇవే…!!

Advertisment
Advertisment
తాజా కథనాలు