Indian Security Helper: రష్యా-ఉక్రెయిన్ వార్‌లో భారతీయుడు అశువులు బాసారు. గుజరాత్‌కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్ రష్యా ఆర్మీ దగ్గర హెల్పర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 21న ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో ఇతను తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లోని డొనెస్కో ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఇతను చనిపోయారు. అప్పుడు హేమిల్ అక్కడే పని చేస్తున్నారని భారత్‌కు చెందిన మరో సెక్యూరిటీ హెల్పర్ సమీర్ అహ్మద్ తెలిపారు. అయితే హేమిల్ మరణం గురించి తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని భారత విదేశా వ్యవహారాల శాఖ చెబుతోంది.
100 మంది ఉన్నారు...
నిన్న కాక మొన్ననే రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారతీయులను బలవంతంగా యుద్ధంలో పాల్గొనాలని...అక్కడి ప్రభుత్వం వత్తిడి చేస్తోందనే వార్తలు వచ్చాయి. ఇవి వచ్చి పూర్తిగా రెండు రోజులు అయినా గడవక ముందే హేమిల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించాడన్న వార్త వెలుగులోకి వచ్చింది. గతేడాది రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లగా నియమించింది. అయితే వీరందరినీ వార్ నుంచి దూరంగా ఉండానలి కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ చేసింది. ఏజెంట్ల మోసం వల్లనే భారతీయులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేస్తున్నారని ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న 12 మంది హైదరాబాద్ వాసులను వెంటనే భారత్ కు తీసుకురావాలని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
గుజరాత్‌కు చెందిన హేమిల్...
హేమిల్ అశ్విన్ గుజరాత్ కు చెందినవారు. 2023 డిసెంబర్‌లోనే ఇతను రష్యా సైన్యం హెల్పర్‌గా జాయిన్ అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇతని తండ్రి హేమిల్‌ను భారతదేశానికి తీసుకురావడానికి హెల్స్ చేయాలని కేంద్రానికి లేఖ కూడా రశారు. హేమిల్ మరో ఇద్దరు భారతీయులు కలిసి సెంట్రీ డ్యూటీ చేస్తుండగా దగ్గరలో బాంబు పడింది. వెంటనే వారు దగ్గరలో ఉన్న బంకర్‌లో దాక్కున్నారు. కాసేపటి తర్వాత మిగిలిన ఇద్దరూ వచ్చి చూడగా హేమిల్ రక్తమడుగులో ఉన్నాడు. ఈ విషయాన్ని అతనితో పాటూ హెల్పర్‌గా పని చేస్తున్న కర్ణాటకకు చెందిన సమీర్ అహ్మద్ తెలిపారు. హేమిల్ చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని వ్యాన్‌లో ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారని చెప్పారు.
Also Read:Kolakata: పైలట్ కళ్ళల్లో లేజర్ లైట్..170మంది ప్రాణాలు గాల్లో..