రహస్యంగా నగ్న చిత్రాల రికార్డ్..అమెరికాలో భారత వైద్యుడి అరెస్ట్

ఎక్కడికెళ్ళినా.. కొంతమంది మగాళ్ళ బుద్ధులు మాత్రం మారవు.కోలకత్తా సంఘటనతో ఇప్పటికే దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే..అమెరికా వెళ్ళి మరీ చెత్త బుద్ధులు ప్రదర్శిస్తున్నారు కొందరు.రహస్యంగా న్యూడ్ ఫోటోలు తీశాడన్న కారణంగా ఎజాజ్ అనే భారత డాక్టర్‌‌ను అరెస్ట్ చేశారు అమెరికా పోలీసులు.

New Update
రహస్యంగా నగ్న చిత్రాల రికార్డ్..అమెరికాలో భారత వైద్యుడి అరెస్ట్

చేసిన పాపం ఊరికే పోదు అంటారు పెద్దలు. ఈ విషయం చదివితే అవును నిజమే అని మీరూ అంటారు. అమెరికాలో
మొగుడి దురాగతాలను తట్టుకోలేక స్వయంగా భార్యే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మరీ అరెస్ట్ చేయింది. భారత్‌కు చెందిన ఒయిమెయిర్‌ ఎజాజ్‌ 2011లో వర్క్‌ వీసాపై అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం మిషిగన్‌లో ఉంటున్న ఇతను ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అక్కడ తాను చేస్తున్న పనేదో తిన్నగా చేసుకోక వెధవ్వేషాలేశాడు. డాక్టర్ వృత్తి అడ్డుపెట్టుకుని లైంగిక దారుణాలకు పాల్పడ్డాడు ఎజాజ్. తాను పనిచేసే చోట ఆసుపత్రి గదులు, బాత్రూమ్‌లు, ఛేంజింగ్ ఏరియాల్లో ఎవరికీ తెలియకుండా కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్‌ చేశాడు.

అక్కడితో ఆగిపోలేదు అయ్యగారి దారుణాలు. మహిళలు స్పృహలో లేనప్పుడు వారిపై అభ్యంతరకంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను రికార్డ్‌ చేసేవాడు. ఆసుపత్రుల్లో పేషెంట్లను కూడా లైంగిక వేధించేవాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఆసుపత్రి వర్గాలు కానీ పేషెంట్లు కానీ ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. దానివల్లనే ఎజాజ్ ఇన్నేళ్ళుగా తప్పించుకుని తిరగ్గలిగాడు. అయితే అతని భార్యకు మాత్రం ఎజాజ్ దురాగతాలు తెలిశాయి. అంతే ఆమె అందరిలా ఊరుకోలేదు. భర్త బండారాన్ని బయటపెట్టింది. అతను రికార్డ్ చేసిన వీడియోలను తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చింది. దీంతో ఆగస్టు 8న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తర్వాత అతడి ఇంటిని సోదా చేయగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అక్కడ అతని ఇంట్లో ఓ కంప్యూటర్‌, ఫోన్లు, 15 ఎక్స్‌టర్నల్‌ స్టోరేజీ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో వేలకు వేలు ఎజాజ్ దారుణాలకు సంబంధించిన వీడియోలున్నాయి. ఒక సింగిల్‌ హార్డ్‌ డ్రైవ్‌లో 13వేల వీడియోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్లౌడ్ స్టోరేజ్‌లోనూ ఈ దృశ్యాలను అప్‌లోడ్‌ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఉందని, దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసేందుకు కొన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

Also Read: Movies: మన అనుకుంటే వస్తా..నచ్చితే వస్తా..అల్లు అర్జున్

Advertisment
Advertisment
తాజా కథనాలు