Movies: నాకు ఇష్టమైతే వస్తా.. వైరల్ అవుతోన్న బన్నీ వ్యాఖ్యలు నాకు ఇష్టమైతే వస్తా.. నా మనసుకు నచ్చితే వస్తా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో అల్లు అర్జున్. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. By Manogna alamuru 22 Aug 2024 in సినిమా హైదరాబాద్ New Update షేర్ చేయండి Allu Arjun: రావు రమేశ్ ప్రధాన పాత్రలో దర్శకుడు లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. దీనికి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సుకుమార్ సతీమణి బబిత సమర్పణలో ఈ నెల 23న సినిమా విడుదల కానుంది. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మై డియర్ ఫ్యాన్స్.. మీరే నాఆర్మీ. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. హీరోను చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరో అయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లవుతున్నా మీరు చూపే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ రుణపడి ఉంటా. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా. తెరపై తరచూ కనిపిస్తా అన్నారు. దాంతో పాటూ ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి. మనం నిలబడగలగాలి. నాకు ఇష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే వస్తా అని అన్నారు బన్నీ. ఈ మాటలు దర్శకుడు సుకుమార్ భార్య బబితను దృష్టిలో పెట్టుకుని చెప్పారు అల్లు అర్జున్. ఆమె పిలవడం వల్లనే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీరిలీజ్‌కు వచ్చానని తెలిపారు. Na manasuki nachithe vasthe support chestha ALPHA bhAAi @AlluArjun 🦁 pic.twitter.com/ZP3e1mLWpE — 𝐍𝐚𝐯𝐞𝐞𝐧ᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ🪓 (@imnaveenDJAA) August 21, 2024 కానీ అల్లు అర్జున్ మన అనుకుంటే చేస్తా..నాకు నచ్చితే వస్తా అన్న మాటలు ఆయన ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బన్నీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేశారు. దాని కోసం అక్కడకు వచ్చారు కూడా. కానీ తన కుటుంబంలో వ్యక్తే అయిన పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా మాత్రం రాలేదు. అలాగే తర్వాత పవన్ గెలిచినప్పుడు, డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా ఎక్కడా కనిపించలేదు. దీనిపై అల్లు అర్జున్ చాలా ట్రోల్స్‌నే ఎదుర్కొన్నారు. అయితే దీని గురించి బన్నీ ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదు. అసలు ఆ తర్వాత అతను పెద్దగా ఎక్కడా బయట కూడా కనిపించలేదు. దాంతో పాటూ పుష్ప–2 షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారి అల్లు అర్జున్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. చెప్పిన సందర్భం వేరైనా..బన్నీ అప్పటి గురించే మాట్లాడారని అంటున్నారు. Also Read: Andhra Pradesh: రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి అన్నపూర్ణ.. #allu-arjun #comment #pre-release-event #movies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి