asian games:చితక్కొట్టిన యశస్వి జైశ్వాల్...22 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఆసియా క్రీడల్లో మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో భారత జట్టు నేపాల్ మీద అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు.

New Update
asian games:చితక్కొట్టిన యశస్వి జైశ్వాల్...22 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్ తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ లో టీమిండియా దుమ్మురేపింది. యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 100 పరుగులు ; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. క్రీజులో ఉన్నంతసేపు యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్లు తడబడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 25 పరుగులు) రాణించాడు. ఆఖర్లో శివమ్ దూబే, రింకూ సింగ్ మెరుపులు మెరిపించడంతో టీమిండియా మంచి స్కోరు సాధించింది. రింకూ సింగ్( 15 బంతుల్లో 37పరుగులు నాటౌట్) అదరగొట్టాడు. నేపాల్ బౌలర్లలో దీపేంద్రసింగ్ ఐరీ రెండు వికెట్లతో సత్తా చాటాడు. సందీప్ లామిచానే, సోమపాల్ చెరో వికెట్ తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు అదిరిపోయే శుభారంభం లభించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదిగా ఆడితే.. యశస్వి జైస్వాల్ ధనాధన్ ఆటతో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్ ఎవరైనా సరే.. తగ్గేదేలే అన్నట్టు సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. యశస్వికి రుతురాజ్ మంచి సహకారం అందించాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన తిలక్ వర్మ, జితేష్ లు నిరావపర్చారు. సింగిల్ డిజిట్లకే పెవిలయన్ బాట పట్టారు. అయితే ఒక పక్క వికెట్లు పడుతున్న యశస్వి మాత్రం తన జోరును కంటిస్యూ చేస్తూనే ఉన్నాడు. 48 బంతుల్లో సెంచరీని అధిగమించాడు. ఇక చివర్లో వచ్చిన రింకూ సింగ్, శివమ్ దూబేలు కూడా మెరుపులు మెపిపించడంతో టీమ్ ఇండియా భారీ స్కోరును సాధించింది.

నేపాల్ బౌలర్లు దీపేంద్ర సింగ్ రెండు వికెట్లు, లమిచానే, కామి ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు