Cricket: విశాఖలో ఇండియా-ఇంగ్లాండ్ రెండో టెస్ట్..బ్యాటింగ్ ఎంచుకున్న భారత్. ఐదు టెస్ట్‌ల సీరీస్‌లో భాగంగా ఈరోజు విశాఖలో ఇండియా-ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభం అయింది. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియాలో మూడు మార్పులు జరిగాయి. గాయాలతో జడేజా, రాహుల్ దూరం అవగా సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. By Manogna alamuru 02 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India Vs England Second Test: ఇండియా వేదికగా మనకు, ఇంగ్లాండ్‌కు మధ్య టెస్ట్ సీరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచి ఒక పాయింట్‌తో ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచ్‌లో మనవాళ్ళు బాగానే ఆడినా చివరలో పట్టు కోల్పోవడంతో ఇంగ్లాండ్ వాళ్ళు విజయం సాధించారు. ఇక ఈరోజు విశాఖలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో గాయాలు పాలయిన రవీంద్ర జడేజా, కే.ఎల్.రాహుల్‌లు ఈ మ్యాచ్‌కు దూరం అయ్యారు. ఇక బౌలర్ సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్‌లో ముఖేష్, కుల్దీప్లు చోటు దక్కించుకున్నారు. వారితో పాటూ యంగ్ క్రికెటర్ రజత్ పాటిదార్ టెస్ట్‌ల్లో అరగేట్రం చేస్తున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ టీమ్‌లోనూ రెండు మార్పుల జరిగాయి. జాక్ లీచ్, మార్క వుడ్ స్థానంలో షోయబ్ బషీర్, జేమ్స్ అండర్స్ వచ్చారు. Also Read: Maldives:తగువు పెట్టుకున్నా బడ్జెట్ ఇచ్చారు..మాల్దీవులకు 600కోట్లు మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఉన్న భారత్.. మొదటి మ్యాచ్‌లో ఒడిపోయిన టీమ్ ఇండియా ఈ రెండవ దానిలో పుంజుకుని గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో గెలిస్తే రెండు టీమ్‌లూ చెరో పాయింట్‌తో సమానంగా ఉంటారు. అలా కాకుండా ఇందులో కూడా ఇంగ్లాండే గెలిస్తే ఆ టీమ్ ఆధిక్యంలోకి వెళ్ళిపోతుంది. అందుకే వారిని ఎలా అయినా కట్టడి చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. విశాఖలోని (Visakhapatnam) వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మకు మంచి రికార్డ్ ఉంది. అలాగే 2016లో ఇదే గ్రౌండ్లో భారత్-ఇంగ్లాండ్‌లు తలపడగా 246 పరుగులతో టీమ్ ఇండియా విజయం సాధించింది. తుది జట్లు... భారత్ (India) : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ (England) : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ #cricket #india-vs-england #england #visakhapatnam #india #second-test మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి