India vs Ireland 2nd T20: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్లతో అదరగొట్టాడు. భవిష్యత్ ఫినిషర్‌గా రేసులోకి వచ్చాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. సమష్టి ఆటతో విజయం దక్కించుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad – 58) హాఫ్ సెంచరీ చేయగా.. సంజూ శాంసన్(Sanju Samson – 40) కీలకమైన ఆసియా కప్ ముందు ఫాంలోకి వచ్చాడు. ఇక చివర్లో వచ్చిన రింకూ సింగ్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులతో అదుర్స్ అనిపించాడు. రింకూకు శివమ్ దూబే (22)కూడా చేయి అందిచాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ రెండు వికెట్లు తీయగా, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్, అడైర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
పూర్తిగా చదవండి..India vs Ireland: సిరీస్ మనదే.. అదరగొట్టిన రింకూ సింగ్
యంగ్ ఇండియా అదరగొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను సొంతం చేసుకుంది. సిక్సర్లతో మంచి ఫినిషింగ్ చేసిన రింకూ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Translate this News: