IND vs SA ODI: ఆడుతూ.. పాడుతూ... సఫారీలతో తొలివన్డేలో భారత్ అలవోక విజయం
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించి జోహెన్నెస్బర్గ్లో జరుగుతున్న తొలి మ్యాచ్లో అలవోకగా విజయం సాధించింది. భారత బౌలర్లు విజృంభించి సఫారీల పతనాన్ని శాసించగా, యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ రాణించారు.