India vs Ireland: సిరీస్ మనదే.. అదరగొట్టిన రింకూ సింగ్

యంగ్ ఇండియా అదరగొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్‌ను సొంతం చేసుకుంది. సిక్సర్లతో మంచి ఫినిషింగ్ చేసిన రింకూ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

New Update
India vs Ireland: సిరీస్ మనదే.. అదరగొట్టిన రింకూ సింగ్

India vs Ireland 2nd T20: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ (Rinku Singh) చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్లతో అదరగొట్టాడు. భవిష్యత్‌ ఫినిషర్‌గా రేసులోకి వచ్చాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. సమష్టి ఆటతో విజయం దక్కించుకున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad - 58) హాఫ్ సెంచరీ చేయగా.. సంజూ శాంసన్(Sanju Samson - 40) కీలకమైన ఆసియా కప్‌ ముందు ఫాంలోకి వచ్చాడు. ఇక చివర్లో వచ్చిన రింకూ సింగ్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. కేవలం 21 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులతో అదుర్స్ అనిపించాడు. రింకూకు శివమ్‌ దూబే (22)కూడా చేయి అందిచాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో మెక్‌కార్తీ రెండు వికెట్లు తీయ‌గా, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్, అడైర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

publive-image

అనంతరం భారీ లక్ష్యచేధనకు వచ్చిన ఐర్లాండ్ తొలి నుంచే వికెట్లు కోల్పోతూ వస్తోంది. కెప్టెన్ స్టిర్లింగ్(0), టక్కర్(0) మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వెంటవెంటనే పెవిలియన్ చేరారు. మరో ఓపెన్ బల్బిర్నీ ఒక్కడే చివరి దాకా పోరాడాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి ఐరీష్ జట్టు 31/3తో కష్టాల్లో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా బల్బిర్నీ మాత్రం భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న అతడిని 72 పరుగుల వద్ద అర్ష్‌దీప్‌ ఔట్ చేయడం భారత్ విజయం లాంఛనమైంది. చివర్లో మార్క్ అడెయిర్‌(23) సిక్సర్లతో చెలరేగినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలతో బుమ్రా, ప్రసిద్ధ్‌, బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. సిక్సర్లతో మంచి ఫినిషింగ్ చేసిన రింకూ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

తొలి టీ20 మ్యాచులో భారత్ బ్యాటింగ్ చేస్తుండగా వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల ముందంజలో టీమిండియాను విజేతగా అంపైర్లు ప్రకటించారు. దీంతో భారత్ 1-0తో ముందజంలో నిలిచింది. ఇక ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ మెన్ ఇన్ బ్లూ విజయం సాధించడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ మన సొంతమైంది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.

** టీ20ల్లో అత్యంత వేగంగా 50వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్‌ సింగ్(33 మ్యాచుల్లో) రెండో స్థానంలో నిలిచాడు. ఇక 30 మ్యాచుల్లో 50వికెట్లు తీసి కుల్ దీప్ యాదవ్ తొలి స్థానంలో ఉన్నాడు.

Also Read: క్రికెట్ చరిత్రలో యూఏఈ సంచలనం.. కివీస్ జట్టుపై గెలుపు

Advertisment
తాజా కథనాలు