WORLD CUP 2023: ఈసారి కూడా విజయం మనదేనా? 8-0తో రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడా?

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ సమరం ఈరోజే. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మామూలుగానే భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒకరకమైన ఫీవర్ ఉంటుంది. అలాంటిది ఇండియాలో జరుగుతోంది అంటే అది మరి కొంచెం ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం భారత్‌లో ఇదే పరిస్థితి. మరికొన్ని గంటల్లో భారత్-పాక్ మ్యాచ్ మొదలవబోతోంది. పాక్ మీద ఓటమి ఎరుగని జట్టుగా రోహిత్ సేన టీమ్ ఇండియాను నిలబెడుతుందా లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

WORLD CUP 2023: ఈసారి కూడా విజయం మనదేనా? 8-0తో రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడా?
New Update

India vs Pakistan World Cup 2023: పిచ్ రెడీ అయిపోయింది. ఆటగాళ్ళు తయారుగా ఉన్నారు. ఇంక మ్యాచ్ మొదలవ్వడమే ఆలస్యం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న తరుణం రానే వచ్చింది. భారత్-పాక్ మ్యాచ్ కు జరిగే రోజు వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఆట మొదలవుతుంది. ప్రపంచకప్ లో భారత్-పాక్ ఇప్పటికి ఏడు సార్లు తలపడ్డాయి. ఇది 8వ సారి. ఇప్పటివరకు పాకిస్తాన్ (Pakistan) జట్టును ఒక్క మ్యాచ్ గెలవనివ్వలేదు టీమ్ ఇండియా (Team India). ఈసారి కూడా ఈ రికార్డ్ ను రోహిత్ సేన నిలబెడుతుందా లేదా అనే చూడాలి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.

పాకిస్తాన్ తో మ్యాచ్ ముందు భారత్ టీమ్ కు అదనపు బలం చేకూరింది. డెంగ్యూతో బాధపడుతూ ఇప్పటివరకు టీమ్‌కు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఈరోజు జట్టులో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గిల్ బాగా ప్రాక్టీసు చేస్తున్నాడని, పాక్‌తో మ్యాచ్‌లో 99 శాతం ఆడతాడని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రకటించాడు. ఇక ఈ వరల్డ్ కప్ (World Cup) లో రెండు టీమ్‌లు ఇప్పటికి అయితే మంచి ఫామ్ లో ఉన్నాయి. రెండు జట్లు రెండు మ్యాచ్ లు ఆడాయి. ఇరు దేశాలు రెండు మ్యాచ్ లనూ గెలుచుకున్నాయి. కాబట్టి రెండూ బలంగానే ఉన్నాయని చెప్పవచ్చు. అది కాకుండా దేశాల మధ్య ప్రస్టేజి ఇష్యూ ఎలానూ ఉండనే ఉంది.

ఇక అహ్మదాబాద్ (Ahmedabad) లో ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే చెదురుముదురు వర్షమే తప్ప మ్యాచ్ ఆగిపోయేంత పడదని స్పష్టం చేసింది. ఇక అహ్మదాబాద్‌లో పిచ్ నల్లరేగడి పిచ్. మొదట బౌలింగ్ కు సహకరించినా నెమ్మదిగా మారిపోయి బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. దీన్ని బట్టి టాప్ గెలవడం కడా ముఖ్యమే అని తెలుస్తోంది. ప్రతీ రోజూ కొత్త సవాలే. అన్నింటికీ సిద్ధంగా ఉంటా అని చెబుతున్నాడు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ. పాక్‌తో మ్యాచ్‌కు ప్రత్యేకంగా జట్టుకు సూచనలు ఏమీ చేయడంల ఏదని తెలిపాడు. వరల్డ్‌కప్ లో అన్ని మ్యాచ్ లలాగే ఇది కూడాను అని అంటున్నాడు.

తుది జట్లు అంచనాః

భారత్ః రోహిత్ శర్మ(కెప్టెన్) శుభ్‌మన్/ ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అశ్విన్/ షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్

పాకిస్తాన్ః బాబర్ ఆజమ్(కెప్టెన్), షఫీక్, ఇమామ్, రిజ్వాన్, షకీల్, ఇప్తికార్, షాదాబ్, నవాజ్, షాహిన్ అఫ్రిది, హసన్/వసీమ్, రవూఫ్

Also Read: 2028 నుంచి ఒలింపిక్స్‌ లో క్రికెట్‌: ఐఓసీ!

#cricket #icc-world-cup-2023 #pakistan #india-vs-pakistan #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe