Cricket in Olympics: 2028 నుంచి ఒలింపిక్స్‌ లో క్రికెట్‌: ఐఓసీ!

ఒలింపిక్స్‌ (Olympics) లో క్రికెట్‌..ఈ మాట వినడానికే ఎంతో బాగుంది కదా.ఎప్పటి నుంచో ఎంతో మంది కోరుకుంటున్న విషయం ఇది. ఇన్నాళ్లుకు ఒలింపిక్స్‌ లో క్రికెట్‌ ను చేర్చాలనే ప్రతిపాదనకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ పచ్చ జెండా ఊపింది.

New Update
Cricket in Olympics: 2028 నుంచి ఒలింపిక్స్‌ లో క్రికెట్‌: ఐఓసీ!

ఒలింపిక్స్‌ (Olympics) లో క్రికెట్‌..ఈ మాట వినడానికే ఎంతో బాగుంది కదా.ఎప్పటి నుంచో ఎంతో మంది కోరుకుంటున్న విషయం ఇది. ఇన్నాళ్లుకు ఒలింపిక్స్‌ లో క్రికెట్‌ ను చేర్చాలనే ప్రతిపాదనకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ పచ్చ జెండా ఊపింది. 128 సంవత్సరాల తరువాత లాస్‌ ఏంజెల్స్‌ 2028 ఒలింపికస్‌ లో క్రికెట్ ను ఓ భాగం చేస్తున్నట్లు ఐఓసీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది.

క్రికెట్‌ తో పాటు ఫ్లాగ్‌ ఫుట్‌ బాల్‌, బేస్‌ బాల్‌, సాఫ్ట్‌ బాల్‌ ఆటలకు సైతం ఐఓసీ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. 2028 ఒలింపిక్స్‌ లో క్రికకెట్‌ ను టీ 20 ఫార్మాట్‌ లో మ్యాచ్‌ లను నిర్వహించనున్నట్లు ఐఓసీ తెలిపింది. క్రికెట్‌ ను ఒలింపిక్స్ లో పెట్టడం వల్ల ఒలింపిక్స్‌ కి వచ్చే ఆదాయం పెరుగుతుంది. దీంతో పాటు టోర్నీని కూడా మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లొచ్చని ఐఓసీ తెలిపింది.

Also read: ఐపీఎస్‌ ల బదిలీ స్థానాలు భర్తీ..హైదరాబాద్‌ కి శాండిల్య!

మొదట 1900 పారిస్‌ ఒలింపిక్స్‌ లో క్రికెట్‌ భాగంగానే ఉంది. కానీ ఆ తర్వాత నుంచి ఈ ఆటను పక్కన పెట్టేశారు. ఒలింపిక్స్‌ నిర్వహించే ప్రతిసారి కూడా క్రికెట్‌ ను ఒలింపిక్స్‌ లో పెట్టాలని ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. కానీ దానికి ఇన్నాళ్లకు ముహుర్తం కుదిరింది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ ను పెట్టడంతో ఒలింపిక్స్‌ లో కూడా ఈ ఆటను పెట్టేందుకు వీలు కుదిరింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు.

క్రికెట్ కి చాలా ఎక్కువ ఖర్చు చేయాలి. మైదానాలు పెద్దగా ఉండాలి. దీంతో ఇన్నాళ్లు ఐరోపా దేశాలు క్రికెట్‌ గురించి పెద్దగా ఆలోచించాలి.
ఐఓసీ క్రికెట్‌ ను ఇన్నాళ్లు పరిగణలోకి తీసుకోలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు ఆ ఆటలో వచ్చిన మార్పులు, సృష్టిస్తున్న ఆదాయంతో ఐఓసీ క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు సిద్దమైంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు