World Cup 2023: మెగా టోర్నీలో ఐదవ విజయం ఎవరిని వరించేనో? నెమ్మదిగా వరల్డ్ కప్ లో హీట్ మొదలవుతోంది. ఒక్కో మ్యాచ్ అవుతున్న కొద్దీ మెగా టోర్నీ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. ప్రపంచకప్ లో ఇవాళ మెగా సమరం జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి చూడని భారత్, న్యూజిలాండ్ లు నేడు తలపడబోతున్నాయి. By Manogna alamuru 22 Oct 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Ind vs NZ World Cup 2023: మెగా టోర్నీలో టాప్ లో ఉన్న రెండు జట్లు ఇండియా, న్యూజిలాండ్. ఆడిన నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించాయి. అంతేకాదు ఆడిన ప్రతీ మ్యాచ్ లో ప్రత్యర్ధుల మీద ఆధిపత్యాన్ని చూపించాయి కూడా. కానీ ఈరోజు ఇద్దరు సమవుజ్జీలు ఆడబోతున్నారు. భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand)...రెండు టీమ్ లు ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. జట్టులో అందరు ఆటగాళ్ళు 100శాతం ఆటను ప్రదర్శంచారు. మరి ఇప్పుడు ఈరోజు రెండు టీమ్ లకూ ఐదవ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో విజయం ఎవరిని వరిస్తుందో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి ఓటమిని ఎవరు రుచి చూస్తారో తెలియాలంటే మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో జరగనుంది. Also Read:పండగ సీజన్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్.... ఇలా వరుసగా అందరినీ ఓడించుకుంటూ ప్రపంచకప్ (World Cup 2023) లో దూసుకుపోతోంది టీమ్ ఇండియా. స్వదేశీ పిచ్ ల మీద ఆడడం భారత్ కు బాగా కలిసొస్తోంది. అయితే భారత్కు అసలు సవాలు ఎదురు అవనుంది. మరోవైపు కీవీస్ కూడా తమ సత్తా చూపిస్తోంది. సెమీస్ కు బలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ టఫ్ గా ఉండే అవకాశం ఉంది. రెండు జట్లు తమ పూర్తి ఆటను కనబరిస్తే మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చును. ఈరోజు మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. ఇది పేసర్లకు అనుకూలించే పిచ్. ఇది కొంచెం న్యూజిలాండ్ కు అనుకూలించే విషయమే. పేస్, స్పిన్ లలో బలంగా ఉన్న న్యూజిలాండ్ బౌలర్ల నుంచి భారత్ బ్యాట్స్ మెన్ కు సవాలు తప్పదు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ అంతా బ్యాటర్లు ఎలా ఆడతారు అన్నదాని మీదనే ఆధారపడి ఉంది. మరోవైపు ధర్మశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. తుది జట్ల అంచనా. భారత్: రోహిత్(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్ దీప్, షమి లేదా శార్దూల్, బుమ్రా, సిరాజ్ న్యూజిలాండ్: కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, లేథమ్(కెప్టెన్), ఫిలిప్స్, చాప్ మన్, శాంట్నర్, ఫెర్గూసన్, హెన్రీ, బౌల్ట్. #cricket #india #match #newzealand #world-cup #icc-world-cup-2023 #2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి