World Cup 2023:రోహిత్ ఇలా, కేన్ అలా..సెమీస్ కు రెడీ అయిన కెప్టెన్లు

ఇప్పటివరకూ ఎలా ఆడామో అలానే ఆడితే సరిపోతుంది అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ అంటుంటే..మేము అన్నింటికీ అలవాటు పడిపోయాం, అండర్ డాగ్స్ గా ఉండడం మాకు కలిసి వస్తుంది అంటున్నాడు కీవీస్ కెప్టెన్ కేన్. మరికొన్ని గంటల్లో మొదలయ్యే సెమీస్ సమరానికి ఇద్దరూ సై అంటే సై అంటున్నారు.

New Update
World Cup 2023:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

మొదటి సెమీస్ మ్యాచ్ కు అన్నీ రెడీ అయిపోయాయి. మధ్యాహ్నం రెండుగంటలకు మ్యాచ్ స్టార్ అవుతుంది. ఇరు జట్లు వ్యూమాలను సిద్ధం చేసేసుకున్నారు. ఇక బరిలోకి దిగడమే తరువాయి. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఇద్దరు కెప్టెన్లూ ఈ రోజు మ్యాచ్ మీద తమ అభిప్రాయాలను చెప్పారు.

ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఫుల్ కాన్ఫిడెన్స్ , ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. వరల్డ్ కప్‌లో మేము ఇప్పటివరకూ మొదటి ఐదు మ్యాచ్‌లలో లక్ష్యాన్ని ఛేదించాము.. తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్‌ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం సిద్ధం చేసుకున్నట్టే అంటున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు బాగా తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు. దాన్ని జయిస్తామనే అనుకుంటున్నానని చెప్పాడు హిట్ మ్యాన్. 1983లో భారత్ మొదటి వరల్డ్ కప్ గెలిచినప్పుడు మేమెవ్వరం పుట్టలేదు. 2011లో సగం మంది క్కికెట్ మొదలుపెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్‌ మ్యాచ్‌లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరమంటూ పంజా విసరడానికి రెడీ అవుతున్నాడు రోహిత్.

Also read:ఈరోజు మ్యాచ్‌లో టాసే హీరోనా? వాంఖడే రికార్డులు ఏం చెబుతున్నాయి?

మరోవైపు మాకు ఇదంతా అలవాటే అంటున్నాడు కేన్ మామ. భారత్‌తో మ్యాచ్‌ మాకు పెద్ద సవాల్‌ అన్న మాట నిజమే. ఇండియా ఎంతో బాగా ఆడుతోంది.కానీ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌ భిన్నమైందే. కలిసి వస్తే ఏ జట్టును అయినా ఓడించగలం. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి అంటున్నాడు కీవీప్ కెప్టెన్ కేన్ విలియమ్స్. లీగ్‌లో ఎలా ఆడినా.. నాకౌట్‌ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వరుసగా గత రెండు వరల్డ్‌ కప్‌లలో మేం ఫైనల్‌ చేరినా మమ్మల్ని ఇంకా అండర్‌డాగ్స్‌గానే చూస్తుంటారు. అది మాకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్యాగ్ కు మేం అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. ఏదైనా జరగవచ్చును. 2019లాగే ఈసారి కూడా స్టేడియంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్‌తో సెమీస్‌లో తలపడటమే ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి ఇద్దరు కెప్టెన్లూ సెమీస్ కు ఫుల్ గా రెడీ అయిపోయినట్టు కనిపిస్తున్నారు. గెలుపోటములు, ఒత్తిడి పక్కన పెట్టి తమ 100 పర్శంట్ ఆటను చూపించడానికి సన్నద్ధం అయ్యారు. దీనిబట్టి ఈరోజు సెమీస్ మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని అనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు