Ind vs Pak World Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పూనకాలు వస్తాయి. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌ను రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం అన్నట్టు ఫీలయిపోతారు. అక్టోబర్ 14న ఇండియా-పాకిస్థాన్ (India - Pakistan) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మ్యాచ్ జరిగే రోజు ఫ్లైట్ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకగా.. హోటళ్ల గదుల ధరలు అయతే ఏకంగా పది రెట్లు పెరిగిపోయాయి. అయినా ఫ్యాన్స్ తగ్గేదేలా అంటూ బుకింగ్స్ చేసుకుంటున్నారు. దాదాపు అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఉన్న హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఇంకా చాలా మందికి రూమ్స్ కావాల్సి ఉంది.
Also Read: మాయదారి దోమలు.. డెంగీ బారిన పడ్డ లెజెండ్.. పాక్‌తో మ్యాచ్‌కు దూరం..!
దీని కోసం వింత వింత మార్గాల్లో పోతున్నారు. అది వింటే ఇదేం పిచ్చిరా బాబూ అనిపించకమానదు. ఎలాగైనా స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ చూడాలనే కోరికతో అహ్మదాబాద్ లో ఆసుపత్రులను బుక్ చేసుకుంటున్నారుట. మ్యాచ్ కు, ఆసుపత్రులకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా... అక్కడే ఉంది అసలు విషయం అంతా. పూర్తి బాడీ చెకప్‌తో పాటు ఒక రాత్రి స్టే చేయడానికి బెడ్స్ బుక్ చేసుకుంటున్నారట క్రికెట్ పిచ్చోళ్ళు. అలా అయితే రాత్రికి రూమ్ దొరుకుతుంది, మ్యాచ్ కూడా చూసేయొచ్చు అన్న ఆలోచనతో. అక్టోబర్ 14వ తేదీకి హాస్పిటల్స్‌లోని రూమ్‌లు, బెడ్స్ కూడా నిండుతున్నాయని ఆహ్మదాబాద్‌లోని వైద్యులు చెబుతున్నారు. ఇది వింతగా అనిపిస్తున్నప్పటికీ హోటల్‌లో రూము ధరలతో పోలిస్తే ఆసుపత్రి బెడ్స్ చవకగా ఉండడమే ఇందుకు కారణం. ఆసుపత్రులలో బెడ్స్ కోసం పెద్ద సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్‌లు రావడం చూసి ఆసుపత్రి యాజమాన్యాలు సైతం అవాక్కవుతున్నాయట.
ప్రస్తుతం అహ్మదాబాద్‌లో కొన్ని హోటళ్ళల్లో రూమ్ కాస్ట్ 1.5 లక్షలు ఉందిట. మ్యాచ్ టికెట్ నే బోలెడు డబ్బులు పోసి కొన్నాం...ఇప్పుడు రూమ్‌కు కూడా అంత డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువస్తాం అనుకుంటూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. హోటల్స్‌లో రూములకు డిమాండ్ ఏర్పడడం కేవలం అహ్మదాబాద్‌కే పరిమితం కాలేదు. చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ఇతర నగరాలలో సైతం హోటల్స్ బుక్ అయిపోయాయి. అహ్మదాబాద్ నుంచి కేవలం గంట ప్రయాణం చేస్తే వచ్చే వడోదరలో కూడా హోటల్ రూము రేట్లు అమాతం ఆరు నుంచి ఏడు రెట్లు పెరిగినట్లు తెలుసోంది.