Healthy Skin : 40లో 20లా కనిపించాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి.

నేటికాలంలో చాలామందికి చిన్నవయస్సులోనే వృద్ధాప్య ఛాయల సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మన జీవనశైలి. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి. వీటి వల్ల యవ్వనం మెల్లగా కనుమరుగవుతోంది. అందమైన శరీర చర్మాన్ని, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో పోషకాలు, విటమిన్లు, ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. ఎలాంటి ఆహారాన్ని మన డైట్లో చేర్చుకుంటే చర్మం మెరిసిపోయేలా చేస్తాయో చూద్దాం.

Healthy Skin : 40లో 20లా కనిపించాలంటే ఈ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి.
New Update

Super Food For Glowing skin : అందంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యువత అందం (Healthy Skin) మీద ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటుంది. నలుగురిలో అందంగా కనిపించేందుకు మార్కెట్లో లభించే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అవి తాత్కాలిక ప్రభావమే చూపిస్తాయి. కానీ వయస్సు మీద పడుతున్న కొద్దీ ముఖంలో మార్పు కనిపిస్తుంది. అయితే కొందరిలో మూడు పదుల వయస్సు రాగానే ముఖంలో మార్పులు కనిపిస్తాయి. దీనికి కారణం మనం తీసుకునే ఆహారం (Food). కూరగాయలు, పండ్లు కాకుండా జంక్ ఫుడ్, సమయానికి నిద్రలేకపోవడం ఇవన్నీ కూడా ఆరోగ్యంతోపాటు, చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

అయినప్పటికీ మీ చర్మం (skin) ముడతలు పడిందని కుంగిపోకండి. జీవనశైలిలో (Lifestyle) కొన్ని మార్పులు చేసినట్లయితే..తిరిగి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఉదాహరణకు యోగా, సమతుల్య ఆహారం మన డైట్లో (Diet) చేర్చుకోవాలి. మీ ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు ఉండాలి. ఎందుకంటే అవి శరీరం, మనస్సు రెండింటినీ బలపరుస్తాయి.

Read Also : గర్భిణీలు నిమ్మకాయలు ఎక్కువగా తింటే అబార్షన్ అవుతుందా?

ప్రోటీన్ పై ప్రత్యేక శ్రద్ధ:

మీ చర్మాన్ని మెరిసేలా ఉంచేందుకు మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండేలా చూసుకోండి. మీ శరీర ఎదుగుదలకు ఇది చాలా అవసరం. అంతేకాదు కండరాలకు బలం చేకూరుస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు, చర్మానికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలు గుడ్లు, చికెన్, మాంసం, పనీర్, మొక్కల ఆధారిత కూరగాయలను మీ డైట్లో భాగం చేసుకోండి.

పండ్లు, కూరగాయలు:

రుచికరమైన పండ్లు చర్మానికి, శరీరానికి మేలు చేస్తాయి. ఇతర కూరగాయలు ఇలాంటి ప్రయోజనాలను అందిస్తాయి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చడం ద్వారా, మీరు వివిధ రకాల పోషకాలు, విటమిన్లు పొందుతారు. వీటిలో ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

తృణధాన్యాలు:

ఇటీవల తృణధాన్యాలు తినే వారి సంఖ్య తగ్గుతోందని చెప్పవచ్చు. ఇటువంటి ఆహారాలు శక్తికి మూలం. మీ ఆహారంలో ఓట్ మీల్, బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణధాన్యాలు చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మం, ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇవి మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. జంక్ ఫుడ్‌కు బదులుగా ఓట్ మీల్ వంటి తృణధాన్యాలు తినండి.

Read Also : యాలకులు తింటే బీపీ ట్యాబ్లెట్ అవసరం లేదు..!!

పాల ఉత్పత్తులు:

పాల ఉత్పత్తులను చాలామంది ఇష్టపడుతుంటారు. ఇది మీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఆహారంలో పాలు, పెరుగు, పనీర్, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను పుష్కలంగా చేర్చుకోండి. వీటి నుంచి కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్ డి వంటి పోషకాలు లభిస్తాయి. నిజానికి, ఇటువంటి ఆహారాలు మీ చర్మం, గ్లోను ప్రోత్సహిస్తాయి.

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు:

ఈ వయస్సులో మీరు తినేవి రాబోయే ఇరవై సంవత్సరాలకు మీ శరీరానికి ఇంధనాన్ని ఇస్తాయని గుర్తుంచుకోండి. మీ ఎముక, గోరు, చర్మం, ఆరోగ్యానికి కాల్షియం అవసరం. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు మిమ్మల్ని రాబోయే 60 సంవత్సరాల పాటు చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి, నువ్వులు, ఆకు కూరలు, నారింజ, బ్రోకలీ, పాలు , పెరుగు మొదలైన వాటిని మీ ఆహారంలో తీసుకోండి .

పైన పేర్కొన్న ఆహారాలతో పాటు, డ్రైఫ్రూట్స్, బ్లూబెర్రీస్, వాల్‌నట్‌లు, ఓట్‌మీల్ వంటి హార్మోన్-బ్యాలెన్సింగ్ ఆహారాలు, నిమ్మ, వెల్లుల్లి వంటి కాలేయాన్ని శుభ్రపరిచే ఆహారాలు, గుడ్లు, మాంసం, చేపలు, బాదం, డ్రై బీన్స్ వంటి రక్తాన్ని పెంచే ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి. డ్రై ఫ్రూట్స్ మీ శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అలాగే బాదం ఫేస్ ప్యాక్ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)

#lifestyle #glowing-skin #lifestyle-tips #healthy-skin #super-foods #healthy-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe