/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Rain-jpg.webp)
Telangana : తెలంగాణలో పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజుల పాటు తేలిపాటి నుంచు మోస్తరు వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్(Yellow Alert) ను జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రభావం వల్ల గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Also Read: నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం..
ఇక బుధవారం కూడా రాష్ట్రంలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 1.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 4.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. హైదరాబాద్‌లో సగటును 4.42 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ములుగు, మంచిర్యాల, మహబూబాబాద్, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
Also Read: రేవంత్‌లో అసహనం పెరిగిపోతుంది.. కిషన్‌రెడ్డి సెటైర్లు