Weather Alert: నేడు రాష్ట్రంలో వర్షాలు, ఆ జిల్లాలకు అలెర్ట్..

ఏపీలోని బాపట్ల ప్రాంతంలో మిచౌంగ్ తుఫాను మంగళవారం సాయత్రం తీరం దాటి.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం పలుచోట్ల వర్షాలు కరిశాయని.. బుధవారం కూడా పలు జిల్లల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది.

TS Weather : చల్లబడిన వాతావరణం..మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..!
New Update

State Wise Weather Forecast : తమిళనాడులోని చెన్నై (Chennai), ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) తీర ప్రాంతాలను అతలాకుతలం చేసిన మిచౌంగ్ తుఫాను మంగళవారం సాయంత్రం ఏపీలోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటింది. ఆ తర్వాత ఇది క్రమంగా బలహీనపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ (Telangana)లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రివరకు తేలిపపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. సగటున 3 సెంటీమీటర్ల వర్షం కురవగా.. అత్యధికంగా భద్రాద్రి కొత్తూగూడెం జిల్లా అశ్వారావుపేటలో 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read: ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!

అయితే బుధవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు చేసింది. అలాగే ఉమ్మడి ఆదిలాబద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

Also Read: విద్యార్థి దశ నుంచే పాలిటిక్స్.. కాబోయే సీఎం రేవంత్ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

#telangana #weather-alert #andhra-pradesh #tamil-nadu #chennai #cyclone-michaung #state-wise-weather-forecast
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe