ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
ప్రధాని మోదికి టీడీపీ ఛీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు.
ప్రధాని మోదికి టీడీపీ ఛీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో తెలిపారు.
మిచౌంగ్ తుఫాను ప్రభావానికి తమిళనాడులోని చెన్నైతో పాటు పలు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వారికి సాయం చేసేందుకు ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ ముందుకొచ్చింది. సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు విరాళం అందించింది.
అప్పుల్లో ఏపీ మొదటి స్థానం.. రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని అన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముగ్గురు వ్యక్తులు వాగులో పడి కొట్టుకుపోయిన సంఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీలో చోటుచేసుకుంది. వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వారిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరు మృతి చెందగా ఇద్దరి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం జనసేన అధినేత విశాఖపట్నానికి రానున్నారు. ఆళ్వార్ దాస్ గ్రౌండ్స్ లో జరిగే సభలో ఏపీలో మిచౌంగ్ సృష్టించిన బీభత్సం గురించి ఆయన ప్రసంగించనున్నారు.
మిచౌంగ్(మిగ్జామ్) తుపాను మరింత బలహీనపడనుంది. అయితే వర్షాలు తగ్గే చాన్స్ మాత్రం ఇప్పుడే లేదు. రానున్న 12-18 గంటల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు భారీ వర్షపాతం సంభవించవచ్చు.
మిచౌంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తుంది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పంటలన్నీ దెబ్బ తిన్నాయి. తీవ్ర గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇక తుపాను నేపథ్యంలో అవసరమైన సహాయక చర్యలు ఫాస్ట్‌గా చేపట్టాలని ఆదేశించారు సీఎం జగన్.
ఏపీలోని బాపట్ల ప్రాంతంలో మిచౌంగ్ తుఫాను మంగళవారం సాయత్రం తీరం దాటి.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం పలుచోట్ల వర్షాలు కరిశాయని.. బుధవారం కూడా పలు జిల్లల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది.
తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు.