Rain Alert: తెలంగాణలో మరో ఐదురోజులు వానలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశ్యాన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి..ఉపరితల ఆవర్తనం ఏర్పాడింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Rain Alert: తెలంగాణలో మరో ఐదురోజులు వానలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

Heavy Rain Alert in Telangana: హెచ్చరికలు జారీ

తెలంగాణకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. ఇక మరో 48 గంటలు ఇలానే కొనసాగే అవకాశం ఉందని సూచించింది.ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు ఉపరితల ఆవర్తనం, ఒక్క ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంకి భారీ వర్ష సూచనా ఉంది. రాష్ట్రానికి మూడు రోజులు ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఉత్తర ఈశాన్య జిల్లాలో ఎక్కువ వర్షం నమోదుయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర..ఈశ్యాన జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చారు.

అత్యధిక వర్షపాతం నమోదు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కుండపోత వాన పడింది. అత్యధిక వర్షపాతం నమోదు కావటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్ల ద్వారా 12500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్‌కు 50 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 9000 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో అవుతున్నట్లు అదికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1090 అడుగులు 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1090 అడుగులు 89 టీఎంసీలు వున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని డిచ్‌పల్లి, గన్నారం, ధర్పల్లి, సిరికొండ, జాక్రాన్‌పల్లి, చీమనుపల్లిలో వాన దంచికొడుతోంది. ఇక కామారెడ్డి జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పెద్ద కొడప్‌గల్ మండలంలో భారీ వర్షం పడింది. భారీ వర్షాల కారణంగా పోచారం వాగు పొంగి పొర్లుతోంది. పోచారం గ్రామం నుండి బయట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్ రుద్రపహడ్ వద్ద తెగిపోయినా తాత్కాలిక వంతెన జుక్కల్-బిచ్కుందకు రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read: ఆ సమయంలో పాలు తాగుతున్నారా? మీరు డేంజర్‌లో పడినట్టే బాసూ!

జిల్లాలకు అతిభారీ వర్షాలు

అంతేకాకుండా రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌ నిర్మల్, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, కొమరంభీమ్, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్‌, పెల్లపల్లి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఉమ్మడి మెదక్ జిల్లాలకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షంతో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిజామాబాద్‌ జిల్లాలోని స్కూళ్లకు నేడు సెలవు ప్రకటించి.. లోకల్ హాలిడేగా డిక్లేర్‌ చేశారు విద్యాశాఖ అధికారులు.

Also Read: పిల్లలకు గిఫ్ట్‌గా జాబిల్లిపై స్థలం కొన్న తండ్రి

Advertisment
Advertisment
తాజా కథనాలు