హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం..
గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ (Hydearabad) నగరాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు. నిమిషం కూడా గ్యాప్ లేకుండా కుమ్మేస్తుంది.
తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశ్యాన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి..ఉపరితల ఆవర్తనం ఏర్పాడింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.