Viral Infections In Hyderabad: హైదరాబాద్‌లో వైరల్ ఇన్ఫెక్షన్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటి బారిన పడి చిన్నపిల్లలు మృత్యువాతను పడుతున్నారు. రోజుకు పది మంది చిన్నారులు చనిపోతున్నారని సమాచారం. ఇది ఒక్క నీలోఫర్ ఆసుపత్రి డేటా ప్రకారం తేలిన లెక్కలు. ఇది కాక మిగతా ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రుల క్యూ లైన్లతో నీలోఫర్ ఔట్ పేషెంట్ విభాగం నిండిపోతోంది. వైరస్ కారణంగా అధిక సంఖ్యలో చిన్నారులు జ్వరం, దగ్గు, చర్మ సమస్యల బారిన పడుతున్నారు. ఇవి తీవ్ర రూపం దాల్చడంతో మృత్యువాతన పడుతున్నారు. ఈ వైరల్ , ఇన్షెక్షన్లు ఇప్పుడే మొదలయ్యాయని..మరికొన్ని రోజుల్లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. రోజుకు దాదాపు వంద మంది దాక ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు. అక్టోబర్ నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. వైరల్ జ్వరాలు, వాటి ద్వారా వచ్చే మూర్చలు మరణాలకు దారి తీస్తున్నాయని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్లు
హైదరాబాద్‌లో రోజుకు దాదాపు పదిమంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తున్న జ్వరాలు, దగ్గు, చర్మ సమస్యలతో సతమవుతున్నారు. పిల్లలను తీసుకువచ్చే తల్లిదండ్రులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు ఈ వైరల్ మరింత ఎక్కువ అవ్వొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
Translate this News: