World Cup: వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురు దెబ్బ వన్డే వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళనలో పడింది. శుక్రవారం శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు షకీబ్ అల్ హసన్ ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో గాయపడ్డట్లు బంగ్లాదేశ్ టీమ్ తెలిపింది. By Karthik 29 Sep 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి వన్డే వరల్డ్ కప్‌కు ముందు బంగ్లాదేశ్ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయపడ్డాడు. దీంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళనలో పడింది. శుక్రవారం శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌కు ముందు షకీబ్ అల్ హసన్ ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో గాయపడ్డట్లు బంగ్లాదేశ్ టీమ్ తెలిపింది. అతడికి స్కానింగ్ తీసినట్లు తెలిపిన టీమ్ మేనేజ్ మెంట్ షకీబ్ గాయం అంత పెద్దదేమీ కాదని తెలిపింది. కానీ షకీబ్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు షకీబ్ అల్ హసన్ జట్టుకు దూరం కావడంతో ఆ టీమ్ పగ్గాలు ఎవరు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా షకీబ్ వన్డే వరల్డ్ కప్‌లో తన మొదటి మ్యాచ్ అక్టోబర్ 7న అఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 7లోపు షకీబ్ కోలుకోవాలని బంగ్లా ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్‌లో వర్గ భేదాలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. షకీబ్ అల్ హసన్‌కు తమీమ్ ఇక్బాల్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. షకీబ్ అల్ హసన్ కారణంగా బంగ్లా క్రికెట్ బోర్డు తమీమ్ ఇక్బాల్‌ను వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే బంగ్లా జట్టు నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం షకీబ్ అల్ హసన్ గాయపడటంతో ప్రస్తుతం బంగ్లా పరిస్థితి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది. తమీమ్ ఇక్బాల్ జట్టులో ఉండి ఉంటే షకీబ్ అల్ హసన్ లేకపోయినా బంగ్లా టీమ్‌ను నడిపించగలడే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు జట్టులో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకపోవడంతో బంగ్లాదేశ్ టీమ్ పరిస్థితి దారుణంగా తయారైందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. #clashes #afghanistan #bangladesh #shakib-al-hasan #world-cup #injury #big-shock #tamim-iqbal #october-7 #first-match మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి