ఎండకాలం పూర్తిస్థాయిలో రాకముందే.. బెంగళూరు వాసులు నీళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరత వల్ల తాగునీటిని సరఫరా చేయలేక చివరికి వాటర్ బోర్టు కూడా చేతులెత్తేస్తోందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత రెండు వారాల నుంచి బెంగళూరు నగర వాసులు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. కర్ణాటకలో నీటి సమస్య ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో హోలీ పండుగ రానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది.
Also read: ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్ని సమర్పించాం: ఎస్బీఐ
600-700 లీటర్ల నీటి కొరత
హోలీ వేడుకల కోసం బోర్‌వెల్ నీటిని వాడుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. పూల్ పార్టీలు అలాగే రెయిన్ డ్యాన్స్‌లను నిషేధించింది. ఈ ఆదేశాలు ఎవరైన ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే బెంగళూరులో రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీటిని వాడుతారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 2వేల మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. దీనివల్ల రోజుకు ఆరు నుంచి ఏడు వందల లీటర్ల నీటి కొరత వస్తోంది. అందుకే నీటి వినియోగంపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల పండగపై ఆంక్షలు విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.
ఐపీఎల్ మ్యాచ్‌కు తప్పని నీటి సంక్షోభం
మరోవైపు బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లను సైతం నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మార్చి 25, మార్చి 29, ఏప్రిల్ 2న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనివల్ల రోజుకు 75 వేల లీటర్ల నీళ్లు స్టేడియానికి అవసరమవుతాయని కర్ణాటక క్రికెట్ బోర్డు పేర్కొంది. నీటి సంక్షోభం ఉన్న కారణంగా స్టేడియాన్ని తడిపడానికి.. శుద్ధి చేసిన మురికి నీటిని మాత్రమే వాడాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్టేడియాన్ని తడిపేందుకు మురికి నీటిని వాడటం ఏంటని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: ‘వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లు పంపడం ఆపండి’.. కేంద్రానికి ఆదేశించిన సుప్రీంకోర్టు