Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్ని సమర్పించాం: ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. భద్రతా కారణాల దృష్ట్యా రాజకీయ పార్టీలకు చెందిన బ్యాంకు ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బయటపెట్టలేదని పేర్కొంది. By B Aravind 21 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి SBI Submits All Details Of Electoral Bonds: గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మార్చి 21లోపు ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను అందించాలని మార్చి 18న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ను ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లు కొన్నటువంటి అందరి వివరాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించి సీరియల్ నెంబర్స్‌తో సహా పూర్తి వివరాలను సుప్రీంకోర్టుకు (Supreme Court) సమర్పించింది. Also Read: ఆ రాష్ట్ర గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్..కోర్టునే ధిక్కరిస్తున్నారంటూ. వివరాలు సమర్పించాం అయితే ఇంతకుముందు ఎస్బీఐ.. ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) ఏ సంస్థలు కొన్నాయి, పార్టీలకు ఎంత విరాళాలు వచ్చాయి అన్న వివరాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. కానీ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నంబర్ల వివరాలు మాత్రం కేంద్ర బ్యాంకు బయటపెట్టలేదు. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా అందజేశారని తెలియజేసే ఈ నంబర్లు లేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. ఎస్బీఐ తీరుపై అసహనం వ్యక్తంచేసింది. మార్చి 21 సాయంత్రం 5 గంటలలోగా అన్ని వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్పీఐ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం సమర్పించింది. అవి మాత్రం బయటపెట్టలేదు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో.. ఎస్బీఐ పలు కీలక విషయాలు తెలిపింది. ' ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఎస్బీఐ అన్ని వివరాలు బయటపెట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా రాజకీయ పార్టీలకు చెందిన బ్యాంకు ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు అందులో పొందుపరచలేదు. అలాగే బాండ్లను కొనుగోలు చేసిన వారికి సంబంధించిన కేవైసీ వివరాలు కూడా బహిర్గతం చేయలేదు. బ్యాంకు ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు తప్ప.. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి బయటపెట్టని విషయాలు ఇంకా ఏమి లేవు. అయితే తాము బయటపెట్టిన యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లు బాండ్లను గుర్తిస్తాయి. అలాగే విరాళాలు ఏ పార్టీకి వెళ్లాయో అని తెలుసుకునేందుకు సహాయపడతాయి' అని తెలిపింది. ఇదిలాఉండగా.. సుప్రీంకోర్టుకు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి సమర్పించిన వివరాలను.. ఎన్నికల సంఘం త్వరలో తమ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also Read: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. ఢిల్లీ హైకోర్టు సంచలన ప్రకటన #telugu-news #electoral-bonds #national-news #sbi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి