ఎండకాలం పూర్తిస్థాయిలో రాకముందే.. బెంగళూరు వాసులు నీళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కొరత వల్ల తాగునీటిని సరఫరా చేయలేక చివరికి వాటర్ బోర్టు కూడా చేతులెత్తేస్తోందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత రెండు వారాల నుంచి బెంగళూరు నగర వాసులు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. కర్ణాటకలో నీటి సమస్య ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో హోలీ పండుగ రానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది.
పూర్తిగా చదవండి..Holi: ఆ రాష్ట్రంలో నీటి కష్టాలు.. హోలీ వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం
బెంగళూరులో నీటి సంక్షోభం ఉన్న నేపథ్యంలో కర్ణాటక సర్కార్ హోలీ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించింది. హోలీ నాడు బోర్‌వెల్ నీటిని వాడుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. పూల్ పార్టీలు అలాగే రెయిన్ డ్యాన్స్‌లను నిషేధించింది.
Translate this News: