Asia Cup 2023: రేపే హై ఓల్టేజ్ మ్యాచ్.. అందరి చూపు కోహ్లీపైనే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వానగండం ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు. By Karthik 01 Sep 2023 in స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Virat Kohli: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ (India - Pakistan) జట్ల మధ్య మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఉత్కంఠ భరితంగా సాగనున్న ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీలంక వేదిగా రేపు ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యచ్‌లో అందరికళ్లు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. ఎలాంటి ఫార్మాట్లో అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఈ రన్ మిషన్ చెలరేగి పోతాడు. బౌర్డర్లో సైనికుడిలు పాక్‌పై తూటాలు పేల్చుతుంటే.. విరాట్ కోహ్లీ పాక్ బౌలర్ల బంతులను బౌండరీలకు తరలిస్తుంటాడు. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై విరాట్ కోహ్లీ ఎలా రెచ్చిపోయాడో అందరికీ తెలిసిందే. ఆసిస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కేవలం 50 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఉండగా.. 4 సిక్సర్ల బాదాడు. అప్పటి మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్న అభిమానులు రేపు జరుగబోయే మ్యాచ్‌లో కోహ్లీనుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇరుజట్ల బలా బలాలు పరిశీలిస్తే పాకిస్థాన్ బౌలింగ్‌లో మెరుగ్గా ఉంటే.. భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్‌లో ఉంది. కానీ పాక్ టీమ్‌లో రిజ్వాన్, బాబర్ (Babar) లాంటి ప్లేయర్‌లు ఫామ్‌లో ఉండటం భారత బౌలర్లను ఆందోళనకు గురిచేసే అంశం. కాగా ఇటీవల భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈ మధ్య కాలంలో ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసివచ్చే అంశం. ఇటీవల కోహ్లీ ఆడిన 13 వన్డేల్లో 50.36 సగటుతో 554 పరుగులు చేశాడు. మరోవైపు రేపటి మ్యచ్‌కు వర్షం అతరాయం కలిగించే అవకాశం ఉంది. గత రెండు రోజుల నుంచి పల్లెకెలెలో పడుతున్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం కూడా వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. Also Read: ఈ మాజీ పాక్ కెప్టెన్‌కి 12ఏళ్ల జైలు శిక్ష? ఎందుకో తెలుసా? #virat-kohli #rain #pakistan #india #kohli #match #asia-cup-2023 #india-vs-pakistan-asia-cup-2023 #high-voltage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి