యూరోపియన్ దేశంలో ఒక రాజకీయ నాయకుడిపై హింసను ప్రేరేపించిన కేసులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ అతను జైలు శిక్ష అనుభవించే ఛాన్స్ ఉంది. డచ్ నాయకుడు గ్రీట్ వైల్డర్స్‌ను హత్య చేయాలని ప్రజలను ప్రేరేపించినందుకు పాక్ మాజీ కెప్టెన్ ఖలీద్ లతీఫ్‌కు 12ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తులకు చెప్పినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. పాక్ తరుఫున 18 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ మాజీ క్రికెటర్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూడా ఇరుక్కోవడంతో నిషేధానికి గురయ్యాడు.
ఇంతకీ ఏం జరిగింది?
2018లో లతీఫ్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. విల్డర్స్ను హత్య చేసినవారికి 3 లక్షల పాకిస్థాన్(కరెన్సీ) రూపాయలు లేదా 21,000 యూరోలు ఇస్తానని వీడియో పోస్ట్ చేశాడు. ఇస్లాంపై వైల్డర్స్ చేసిన వ్యాఖ్యపై లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేవాడు. ముస్లిం ప్రవక్త మహమ్మద్ క్యారికేచర్లను చిత్రీకరించే కార్టూన్ని ప్లాన్ చేసినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. చివరికి పోటీ రద్దయింది కానీ అప్పటికే లతీఫ్ ఈ వీడియోను పోస్ట్ చేసేశాడు. ఇస్లాంలో మహమ్మద్ ప్రవక్త చిత్రాలు నిషిద్ధం. ఈ క్యారికేచర్లు ముస్లింలను తీవ్రంగా కించపరిచేలా ఉన్నాయన్నది లతీఫ్ వాదన. లతీఫ్ పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియోకు ఐదేళ్ల తర్వాత, అతనిపై హత్యను ప్రేరేపించడం, నేరపూరిత చర్యలకు ప్రేరేపించడం, వైల్డర్స్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టడం లాంటి అభియోగాలు మోపారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఖలీద్ లతీఫ్ ఎవరు?
Cricket news: ఈ మాజీ పాక్ కెప్టెన్‌కి 12ఏళ్ల జైలు శిక్ష? ఎందుకో తెలుసా?
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఖలీద్ లతీఫ్‌కి 12ఏళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. నెదర్లాండ్స్‌లో రైట్ వింగ్ లీడర్ గ్రీట్ వైల్డర్స్ని హత్య చేస్తే 3లక్షల రూపాయలు ఇస్తానని గతంలో లతీఫ్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ముస్లిం ప్రవక్త మహమ్మద్ క్యారికేచర్లను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వైల్డర్స్ని తిడుతూ ఈ వీడియో పోస్ట్ చేయగా.. హత్యను ప్రేరేపించడం, నేరపూరిత చర్యలకు ప్రేరేపించడం, వైల్డర్స్‌కు వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టడం లాంటి అభియోగాలు మోపారు. లతీఫ్ వర్సెస్ వైల్డర్స్ కేసులో సెప్టెంబర్ 11న కోర్టు తీర్పు వెలువరించనుంది.
Translate this News: