Varahi Yatra: సీఎం జగన్.. ఓ మూలన కూర్చోలేరా?: పవన్

Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేటి నుంచి 17వ తేదీ వరకూ వైజాగ్ లో ఈ యాత్ర కొనసాతుందని వెల్లడించారు. శుక్రవారం విశాఖకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీఒక్కరినీ అభినందించారు. విశాఖ పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపై పవన్ పర్యటన షెడ్యూల్‌పై నేతలతో నాదెండ్ల చర్చించి ఖరారు చేశారు.

New Update
Varahi Yatra: సీఎం జగన్.. ఓ మూలన కూర్చోలేరా?: పవన్

Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: సీఎం జగన్‌పై మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను ఇలా దోపిడీ చేశారు కాబట్టే.. అక్కడి నుంచి తరిమేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను దోచుకుంటారని మండిపడ్డారు. ప్రభుత్వ భవనం అంటే ఏమిటి? సీఎం ఇళ్లునా? ఓ మూలన కూర్చోలేరా?ఎన్ని ఇళ్లు కావాలి? ఒక ఇళ్లు సరిపోదా? సర్క్యూట్ హౌస్ సరిపోదా? అని ప్రశ్నించారు. దోచుకోవాలంటే శాంతియుతంగా విజువల్ కావాలా? అడగండి. అందరూ నిలదీయండి అని పేర్కొన్నారు. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు.

అంతకుముందు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను సందర్శించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు షరతులతో కూడిన అనుమతలు ఇవ్వడంతో నోవాటెల్ హోటల్ నుంచి పవన్ బయటకు వచ్చారు. పవన్ వారాహి వెహికల్ తో పాటు మరో 7 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

మరోవైపు పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా జగదాంబ సెంటర్‌లో జరిగిన సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ విశాఖ తూర్పు ఏసీపీ మూర్తి నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, సభల్లో బాధ్యతగా మాట్లాడాలని తెలిపారు. వాలంటీర్లు, ఆంధ్రా యూనివర్సిటీపై ఆరోపణలు చేసినందకు గాను సెక్షన్ 30 కింద నోటీసులు జారీచేశామని తెలిపారు.

వైజాగ్ లో పవన్ కళ్యాణ్ 'వారాహి యాత్ర' ఫైనల్ షెడ్యూల్:

విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేటి నుంచి 17వ తేదీ వరకూ వైజాగ్ లో ఈ యాత్ర కొనసాతుందని వెల్లడించారు.

శుక్రవారం విశాఖకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీఒక్కరినీ అభినందించారు. విశాఖ పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపై పవన్ పర్యటన షెడ్యూల్‌పై నేతలతో నాదెండ్ల చర్చించి ఖరారు చేశారు.

పవన్ కళ్యాణ్ 'వారాహి యాత్ర' షెడ్యూల్ వివరాలు:

• 12న ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శ. అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్‌బీసీ ల్యాండ్స్ ప్రాంతం సందర్శన

• 13న గాజువాక నియోజకవర్గంలో బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.

• 14న ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు ఆక్రమణకు గురైన భూముల సందర్శిస్తారు

• 15న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకానున్న జనసేనాధిపతి

• 16న మళ్లీ విశాఖకు వచ్చి భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బల సందర్శిస్తారు

• 17న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

Also Read: అన్నదమ్ములిద్దరూ కూడా ప్యాకేజీ స్టార్లే..వారి మాటలు నమ్మకండి!

Advertisment
తాజా కథనాలు