Undavalli writ petition:నేడు ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ మీద విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరిన్ని చిక్కులు తప్పేట్టు లేవు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐతో విచారించాలని ఆయన కోరారు. ఈ కేసు ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.

New Update
Skill Development Scam Case:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఉండవల్లి పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పై ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఉండవల్లి రిట్ పిటిషన్ దాఖలు చేసారు. 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలుకేసును సిఐడి నుంచి సీబీఐ విచారణకు ఇవ్వాలని ఉండవల్లి పిటిషన్ లో కోరారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ED,చంద్ర బాబు,అచ్చెన్నాయుడు లను ప్రతివాదులుగా చేర్చారు. దీని మీద ఈరోజు జస్టీస్ ధీరజ్ సింగ్ టాకుర్ ధర్మాసనం విచారణ జరపనున్నారు.

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్ కూడా ఈరోజు హైకోర్టులో విచారణ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.15 నివిషాలకు వాదనలు జరగనున్నాయి. ఇందులో బాబు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు తరుపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వర్చువల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరుపున ఏజీ శ్రీరామ్ వాదించారు. దీంతో పాటూ చిత్తూరు అంగళ్ళు ఘటన కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో చాలా మంది టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. అందుకే బాబుకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరుఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేశ్ ను ఏ14 చేర్చారు.

ఇక ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ పిటీషన్ మీద కూడా ఈరోజే విచారణ జరగనుంది. అటు చంద్రబాబు బెయిల్ పైన ఈ రోజు విచారణ జరగనుంది.

Advertisment
తాజా కథనాలు