Undavalli writ petition:నేడు ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్ కుమార్ రిట్ పిటిషన్ మీద విచారణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరిన్ని చిక్కులు తప్పేట్టు లేవు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐతో విచారించాలని ఆయన కోరారు. ఈ కేసు ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది.