Weather Alert: తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలే..

తెలంగాణలో మరో ఐదురోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

New Update
Weather Alert: ఈ నెల 12 వరకు భారీ వర్షాలు

సోమవారం తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, గచ్చిబౌలి, పంజాగుట్ట,ఫిల్మ్ నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, శంషాబాద్, చార్మినార్, అమీర్ పేటలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: ఆర్మీ జవాన్లకు రాఖీ కట్టిన మహిళలు.. వీడియో వైరల్

ఆదిలాబాద్‌, జగిత్యాల, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిద్దిపేట, వికారాబాద్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఈదురుగాలులు వీయడం, పిడుగుపట్లు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరో ఐదురోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు