![Raksha Bandhan: ఆర్మీ జవాన్లకు రాఖీ కట్టిన మహిళలు.. వీడియో వైరల్](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-53-2.jpg)
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం రాఖీ పండుగను జరపుకుంటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఇంట్లో చూసినా అక్కాచెల్లెళ్లు.. తమ అన్నాదమ్ముళ్లకు రాఖీలు కడుతూ సంతోషమైన క్షణాలను గడుపుతున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ తమ బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పండుగ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో సోని గ్రామస్థులు.. ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టారు. ఆ తర్వాత వారికి స్వీట్లు అందించారు.
#WATCH | On the festival of 'Raksha Bandhan', locals tie 'Rakhi' and offer sweets to Army personnel in Soni village along LoC in the Uri sector of Jammu & Kashmir pic.twitter.com/FH6MO8Lj2E
— ANI (@ANI) August 19, 2024
Also read: రాఖీ పండుగ వేళ.. కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్
మరోవైపు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని సముద్ర తీరంలో పండుగ సందర్భంగా సైకత శిల్పాన్ని రూపొందించాడు. ఇక దేశప్రజలకు ప్రధాని మోదీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన పండుగ అందరి బాంధవ్యాల్లో కొత్త మాధుర్యాన్ని, ఆనందం, శ్రేయస్సును ఇవ్వాలని కోరుతున్నానంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబ సభ్యులు.. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మకి తన నివాసంలో రాఖీ కట్టారు. ఆ తర్వాత సీఎం వారికి కానుకలు అందించారు.
Also Read: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క!