ప్రేమ పేరుతో యువకుడిని ఓ కిలాడి మోసం చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖకు చెందిన ప్రియాంకతో కరీంనగర్‌కు చెందిన నాగారాజుకు తమిళనాడు ఈషా ఫౌండేషన్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో కొన్నేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేశారు. అనంతరం పెళ్లి కోసం బంగారం కొనాలంటూ యువకుడి వద్ద నుంచి రూ.16 లక్షలు తీసుకున్న సదరు యువతి పరార్ అయ్యింది. ఆ యువతి ఆస్ట్రేలియాకు జంప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రియురాలు మోసం చేసిందనే మనస్తాపంతో నాగరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Love Cheating: కరీంనగర్ లో ప్రేమ కిలాడి.. రూ.16 లక్షలతో జంప్!
ఓయువకుడిని ప్రేమించినట్లు నమ్మించి.. పెళ్లి బంగారం కోసమంటూ రూ.16 లక్షలు తీసుకుని జంప్ అయిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. ప్రియురాలు మోసం చేయడంతో బాధిత యువకుడు నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Translate this News: