Brazil Floods: బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు

భారీ వర్షాలు, వరదలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్ద్రపంచ దేశాలను ముంచెత్తుతున్నాయి. దుబాయ్, చైనా, కెన్యాల తరువాత ఇప్పుడు బ్రెజిల్‌ వరదలో కొట్టుకుపోయింది. దారుణంగా వచ్చిన ఫ్లడ్‌కు 100 మంది పైగా మృతి చెందారు.

New Update
Brazil Floods: బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు

Brazil Floods: వాతావరణ పరిస్థితులు ప్రపంచ దేశాలును అల్లకల్లోలం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఎండలు దంచేస్తుంటే..మరికొన్నింటిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా బ్రెజిల్‌ను వరద ముంచెత్తింది. బ్రెజిల్‌లోని దక్షిణ రియో ​​గ్రాండే దో సుల్ (Rio Grande do Sul) రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సోమవారం నుండి కనీసం ఎనిమిది మంది మరణించారు మరియు 21 మంది అదృశ్యమయ్యారని ఆ దేశ పౌర రక్షణ వ్యవస్థ చెప్పింది. మొత్తం దేశంలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వేల సంఖ్యలో నిరాశ్రయులు అయ్యారు. వరదలకు బ్రిడ్జిలు, ఇళ్లు కొట్టుకుపోయాయి.

బ్రెజిల్‌లో ఎల్‌నినో కారంగా భారీ వర్షాలు కురిశాయి. ఆగకుండా పడిన వాన కారణంగా వరదలు సంభవించాయి. వరదల వల్ల చాలా భీభత్సమే జరిగింది అక్కడ. దీంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది బ్రెజిల్ ప్రభుత్వం. దీన్ని అత్యంత ఘోరమైన విపత్తుగా ప్రభుత్వం ప్రకటించింది. గల్లంతైన వారికోసం హెలీకాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టింది. మరోవైపు రాబోయే 24 గంటల్లో మరింత వర్షం పడే అవకాశాలున్నాయని బ్రెజిల్ వాతావరణ శాఖ చెప్పింది. ఒక్కసారిగా పరిస్థితులుమారిపోవడం...నిరాశ్రయులు అయిపోవడంతో బ్రెజిల్ ప్రజలు బికకుబిక్కుమంటున్నారు.1,400 మందికి పైగా తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తున్నా.. సొంత వాళ్లను, ఇళ్ళను పోగొట్టుకుని బాధపడుతున్నారు.

లోయలు, పర్వత సానువులు మరియు నగరాలు వంటి కొన్ని ప్రాంతాలలో, 24 గంటల్లో 150 మిల్లీమీటర్ల (6 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షం కురిసిందని పోర్చుగీస్ ఎక్రోనిం INMET ద్వారా పిలువబడే బ్రెజిల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటియోరాలజీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దక్సిణ అమెరికా అంతటా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని చెప్పింది.

Also Read:Lok Sabha Elections 2024: రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌..అమేథీ నుంచి బరిలో ఎవరంటే!

Advertisment
తాజా కథనాలు