Rahul Gandhi To Contest From Raebareli: యూపీలో కాంగ్రెస్ కు కంచుకోటలాంటి స్థానాలు అయిన రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు ఇంతకు ముందు వరకు అభర్థులను ప్రకటించలేదు. నామినేషన్లకు ఈరోజు లాస్ట్ డేట్. దీంతో ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. దానికి తెర దించుతూ అమేధీ, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్ధులను ఈరోజు ఉదయాన్నే ప్రకటించింది కాంగ్రెస్.గురువారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ అర్థరాత్రి వరకు హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. అయితే ఆయన తన అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఇంత ఆలస్యం ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియలేదు. మొత్తానికి ఎట్టకేలకు అందరి ఊహలకు కళ్ళెం వేస్తూ అమేధీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి కేఎల్. శర్మ పోటీకి దిగుతారని కాంగ్రెస్ అనౌన్స్ చేసింది.
రాయ్‌బరేలీ నుంచి రాహుల్ రంగంలోకి దిగుతారని కాంగ్రెస్ వర్గాలు ముందు నుంచి అనుకుంటున్నాయి. అయితే ముందు ఇక్కడ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ సోనియా ప్లేస్ లో కుమారుడు రాహుల్ రంగంలోకి దిగాడు. ఇంకో స్థానం అయిన అమేథీలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. ఈ ప్రచారమే జోరుగా సాగింది. కానీ ఆ స్థానంలోకి పార్టీ సీనియర్ నాయకుడు కేఎల్ శర్మను రంగంలోకి దించారు.
Lok Sabha Elections 2024: రాయ్‌బరేలీ నుంచి రాహుల్..అమేథీ నుంచి బరిలో ఎవరంటే!
రాయ్ బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రంగంలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. అమేథీ నుంచి పార్టీ సీనియర్ నాయకుడు కేఎల్ శర్మను రంగంలోకి దించాయి. ఈసారి ఎన్నికలకు సోనియా, ప్రియాంక ఇద్దరు దూరంగా ఉన్నారు.
Translate this News: