Chandrababu Quash Petition: నేడు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ

ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. అలాగే నేడు హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో బెయిల్ మంజూరు కోసం వేసిన పిటిషన్ మీద కూడా విచారణ జరగనుంది.

New Update
Chandrababu Quash Petition: నేడు హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ

Chandrababu Quash Petition: తన మీద సీఐడీ నమోదు చేసిన కేసు, రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని చంద్రబాబు తురుపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద ఈరోజు విచారణ జరుగుతుంది. దీంతో పాటుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు (Inner Ring Road Case) లో బెయిల్ మంజూరు చేయాలని లాయర్లు పిటిషన్ వేశారు. దీని మీద కూడా హైకోర్టులో (High Court) ఇవాళ విచారణ జరగనుందని సమాచారం. ఈ స్కాంలో బాబు ఏ1గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంటరల్ జైలులో (Rajahmundry Central jail) రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఇక చంద్రబాబు పై CID నమోదు చేసిన FIR పై హైకోర్టు లో వేసిన క్వాష్ పిటిషన్ లో కీలక అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదని అయినా అరెస్ట చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. 2022లో బాబు పేరు బయటికి వచ్చింది. కానీ 2023 సెప్టెంబర్ 8 న ఆయనను అరెస్ట్ చేశారు. అంతేకాదు రిమాండ్ రిపోర్ట్ లో చూపించిన ఆరోపణలకు కూడా ఎటువంటి ఆధారాలు లేవని పిటిషన్ లో చెబుతున్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే బాబు మీద ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికించారు. అసలు చంద్రబాబు నేరం చేశారనడానికి సిఐడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాదు సీఐడీకి వచ్చిన ఫిర్యాదులో కూడా ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు. అందుకే ఎఫ్ఐఆర్ క్వాష్ చేసేందుకు పిటిషన్ దాఖలు చేశారు.

కేసు నమోదు అయితే చేశారు కానీ ఆధారాలు సేకరించడంలో సిఐడి విఫలమైందని క్వాష్ పిటిషన్ లో వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే బాబును నిందితుడిగా చేర్చారని ఆరోపించారు. సెక్షన్ 409 బాబు పై పెట్టడమైతే పెట్టారు కానీ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను సిఐడి చూపలేక పోయింది. బాబు పెట్టిన కేసులు, సెక్షన్లలో 409 తప్ప మిగతా సెక్షన్లన్నీ ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేవే. ఇందులో శ్రీవరో కొంతమంది నిందితుల వాంగ్మూలాలు తప్ప ఎలాంటి ఆధారాలు సిఐడి సేకరించలేకపోయింది.అరెస్టు సమయంలో కూడా crpc 50 ను పోలీసులు ఫాలో కాలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కేవలం క్రైమ్ నెంబర్ , ఎఫ్ఐఆర్ సెక్షన్లు తప్ప ఎలాంటి సమాచారాన్ని పోలీసులు చెప్పలేదు.

ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) ఆ సెంటర్లు ఉన్న 40 కాలేజీలలో ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అక్కడ ఏ విధంగా కోట్ల రూపాయల నిధుల నష్టం జరిగిందో సిఐడి ఆధారాలు చూపలేకపోయిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ కేసులో ఇంతకు ముందు అరెస్ట్ అయిన నిందితుల బెయిల్ పిటిషన్ ల సమయంలోనూ కోర్టుకు ఎలాంటి ఆదారాలు దొరకలేదు. వారికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దాంతో పాటూ ఇప్పటివరకు ఈ కేసులో సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేయలేకపోయింది. అందుకే ఈ కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం తో పాటు, రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని పిటిషన్ లో కోరారు. దీని మీదనే కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. పిటిషన్ లో పెట్టిన ఈ విషయాలను కోర్టు అంగీకరిస్తుందో లేదో తేలాల్సి ఉంది.

Also Read: స్కిల్‌ స్కామ్‌ కేసులో ఈడీ పిడుగు ఆ అధికారులకు నోటీసులు!

Advertisment
తాజా కథనాలు