Raja Singh: మహమూద్‌ అలీ పేరుకే హోం మంత్రి : రబ్బర్ స్టాంప్ .. రాజాసింగ్ సీరియస్ కామెంట్స్

హోం మంత్రి మహమూద్‌ అలీపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి ఓ రబ్బర్‌ స్టాంప్‌లా మారారని విమర్శించారు. రానున్న రోజుల్లో తెలంగాణ మర్డర్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Raja Singh:   మహమూద్‌ అలీ పేరుకే హోం మంత్రి :  రబ్బర్ స్టాంప్ .. రాజాసింగ్ సీరియస్ కామెంట్స్

Raja Singh Comments On Mahmood Ali: మహమూద్‌ అలీ పేరుకే హోం మంత్రి అని మండిపడ్డారు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌. రాష్ట్రంలో లా ఆండ్‌ ఆర్డర్‌ లేదని, ఈ విషయంలో  ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అత్తాపూర్‌లో రాహుల్‌ సింగ్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని, మూడు రోజులు అవుతున్నా పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదని మండిపడ్డారు.

కేసీఆర్‌ ఏది చెబితే అది చేయటం తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. హోం మంత్రి పదవిలో ఉన్నా ఆలీకి శాంతి భద్రతలపై అవగాహన లేదని,  హోం మంత్రి మహమూద్‌ ఆలీ రబ్బర్‌ స్టాంప్‌లా మారారని రాజాసింగ్ ఆరోపించారు.  సీఎం కేసీఆర్‌ కూడా శాంతి భద్రతలను పట్టించుకోవటం లేదని, అమలు చేయటం చేతకాకపోతే తమకు అప్పగించాలని అన్నారు.

ఎంఐఎంకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మర్డరేనా?

రాష్ట్రంలో ఎంఐఎంకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మర్డర్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు అండగా ఉంటోందని ఆరోపించారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే రాహుల్‌ సింగ్‌ను కత్తులతో పొడిచి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఇలానే కొనసాగితే తెలంగాణ తెలంగాణ గడ్డ మర్డర్‌లకు అడ్డగా మారే ప్రమాదం ఉందని రాజాసింగ్   ఆరోపించారు.

Also Read: గోషామహల్ బీఆర్ఎస్ టిక్కెట్ ఎంఐఎం చేతిలో.. రాజాసింగ్ ఎందుకు ఆ మాట అన్నారు?

Advertisment
తాజా కథనాలు