MLA Raja Singh: గోషామహల్ బీఆర్ఎస్ టిక్కెట్ ఎంఐఎం చేతిలో.. రాజాసింగ్ ఎందుకు ఆ మాట అన్నారు?
సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని, రానున్న రోజుల్లో తనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.