Population: ఆ దేశంలో నలుగురు పిల్లలు ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు ఐరోపాలో హంగేరీ దేశం జననాల క్షీణత సమస్య ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కనీసం నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు జీవతాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. By B Aravind 22 Jun 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రపంచ జనాభా రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ.. పలు దేశాల్లో మాత్రం జననాల క్షీణత సమస్య ఆందోళన కలిగిస్తోంది. ఆర్థికపరంగా, వృత్తిపరంగా సవాళ్లు రావడంతో అక్కడున్న యువతీ, యువకులు పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడి జనాభా భారీగా తగ్గిపోవడంతో పాటు భవిష్యత్తు తరానికి భరోసా లేకుండా పోతోంది. దీనికోసం తమ దేశాలకు వలసలపై వచ్చేవారిపైనే ఆధారపడాల్సిన పరిస్థతివ వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఐరోపాలో హంగేరీ దేశం ఎదుర్కొంటోంది. జనాభా పెంచుకోవడం కోసం అనేక ప్రయాత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కనీసం నలుగురు పిల్లలు ఉన్నవారు జీవతాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. Also read: మక్కాలో చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు ఈ సందర్భంగా హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్ మాట్లాడుతూ.. ఐరోపాలో జననాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. పశ్చిమ దేశాల్లో ఈ సమస్యలకు వలసలే పరిష్కారంగా మారాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అందుకే తాము భిన్న ఆలోచనలతో వచ్చామని.. కనీసం నలుగురు లేదా అంతన్న ఎక్కువమందిని కనే మహిళలకు జీవితాంతం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ఎక్కువ మంది సభ్యులు ఉండే కుటుంబాల కోసం పెద్ద పెద్ద కార్లు కొనేందుకు సబ్సీడీలు కూడా ఇవ్వనున్నట్లు హంగేరీ ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల పెంపకం కోసం దేశంలో 21 వేల క్రెచ్‌లను ప్రారంభించామని చెప్పింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లు అవుతుందని హంగేరీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలాఉండగా.. గతంలో కూడా హంగేరీ జనాభా పెంచేందుకు పలు ఆఫర్లు తీసుకొచ్చింది. ఇందుకోసం 2019లో ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద 41 ఏళ్లు రాకముందు వివాహం చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ (హంగేరీ కరెన్సీ) సబ్సిడీ రుణాలు ఇచ్చింది. పెళ్లైన తర్వాత ఆ మహిళలు ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తే రుణంలో మూడోవంతు మాఫీ చేస్తామని.. ముగ్గురు కన్నాఎక్కువ సంతానం ఉంటే రుణాన్ని మొత్తం మాఫీ చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హంగేరీ జనాభా 96.4 లక్షలే ఉండటంతో అక్కడి ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. Also Read: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆయనకే: మిలిందా గెేట్స్ #telugu-news #national-news #population #hungary మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి