HAJJ: మక్కాలో చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు

హజ్ యాత్రకు వెళ్ళినవారిలో చాలామంది మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1000 మంది చనిపోయారు. ఇందులో 98మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. మనదేశం నుంచి ఇప్పటివరకు 1.75 లక్షల మంది వెళ్ళినట్లు తెలిపింది.

New Update
HAJJ: మక్కాలో చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు

Haj-Pilgrimage: సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారం క్రితం ఇక్కడ అత్యధికంగా 51.8 డిగ్రీలు నమోదైంది. ఈ ఎఫెక్ట్ హజ్ యాత్ర మీద విపరీతంగా పడింది. మక్కా యాత్రకు వచ్చిన వేలమంది వడదెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1000 మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది ఈజిప్టు వాళ్ళే ఉన్నారు. అయితే ఇతర దేశస్థులు కూడా కొంత మంది చనిపోయారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాల ప్రకటనల ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించినట్లు సమాచారం. మెడికల్‌ కాంప్లెక్సు వద్ద కొంతమంది మృతుల వివరాలు ప్రకటించారు. ఈ జాబితాలో అల్జీరియా, ఈజిప్టుతోపాటు భారత్‌కు చెందినవారి పేర్లు కూడా ఉన్నాయి.

దీన్నిబట్టి హజ్ యాత్రలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు 98మంది భారతీయులను గుర్తించారు. ఈ యాత్రకు మొత్తం 1.75 లక్షల మంది వెళ్ళారు. ఇందులో సహజకారణాలు, అనారోగ్యం, వృద్ధాప్యం కారణాల వల్లనే ఎక్కువ మంది చనిపోయారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. మరోవైపు గతేడాదితో పోలిస్తే మృతుల సంఖ్య తగ్గిందని చెప్పారు. లాస్ట్ ఇయర్ ఈ సంఖ్య 187గా ఉంది.

Also Read:Andhra Pradesh: పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగింత.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు