Israel-Hamas War : ప్లీజ్ మాకు యుద్ధంలో హెల్ప్ చేయండి..పాక్ ను కోరిన హమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు హమాస్ పాకిస్తాన్ సహాయాన్ని కోరింది. పాకిస్తాన్ చాలా ధైర్యవంతమైన దేశమని అందుకే ఆ దేశాన్ని సహాయం కోరామని హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియే తెలిపినట్లు సమాచారం. By Manogna alamuru 07 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hamas Leader Asks 'Brave' Pakistan Help : యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఇజ్రాయెల, హమాస్ రెండు వర్గాలూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ (Israel-Hamas)స్థావరాలు అయిన సొరంగాలను నీటితో నింపాలని అనుకుంటుంటే...హమాస్ పాకిస్తాన్ (Pakistan)సహాయాన్ని అర్ధిస్తోంది. యుద్ధంలో పాకిస్థాన్ సహాయాన్ని హమాస్ సీనియర్ నాయకుడు ఇస్మాయిల్ హనియే కోరినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌ను చాలా ధైర్యవంతమైన దేశంగా కొనియాడిన ఆయన.. ఇజ్రాయెల్ దారుణాన్ని ఆపగల శక్తి ఆదేశానికే ఉందని అన్నారు. తమకు యుద్ధంలో పాకిస్థాన్ సహాయం అందిస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్లు ఎన్నో త్యాగాలు చేశారని హనియే తెలిపారు. Also read:నష్టాల్లో స్టాక్ మార్కెట్..రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధర గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఇస్లాం దేశాలను అన్నీ వ్యతిరేకించాలని హనియే గుర్తు చేశారు. 16,000 మంది పాలస్తీనియన్లను అరెస్టు చేయడం, పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడంతో సహా ఇజ్రాయెల్ చర్యలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తున్న అమెరికా సహా ఇతర దేశాలపై ఆయన మండిపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధంతోనే కాక మాటలతో కూడా హమాస్ మీద విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడుల వెనుక దాని ఫౌండర్ యహ్యా షిన్వర్ ఉన్నారని ఆ దేశ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. యహ్యనే దాడులకు ఆర్కిటెక్ట్ అని చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని షిన్వర్ ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ అక్టోబర్ 7 దాడులకు సంబంధించిన ప్లాన్ విరాలకు సంబంధించిన వీడియో వారికి దొరికింది. అయితే యహ్యా మాత్రం ఇంకా దొరకలేదని...అతనిని కూడా త్వరలోనే పట్టుకుంటామని నెతన్యాహు చెప్పారు. #help #israel #hamas #pakisthan #war #hamas-israel-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి