Gold Rate : పైపైకే అంటున్న బంగారం..టాప్ లేచిపోతోంది బంగారం ధరలు రాకెట్‌లా దూసుకుపోతోంది. ఎక్కడా ఆగడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న పసిడి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి కంటే ఇవాళ మరింత ఎక్కువ అయ్యాయి బంగారం ధరలు. By Manogna alamuru 08 Apr 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Gold Rate Today: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకూ కొంచెం కొంచెం పెరుగుతూ షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. బంగారం వెంటే వెండి ధర కూడా పరుగులు తీస్తోంది. నిన్నటికి ఇవాల్టికి ఏకంగా తులం మీద 300 రూపాయలు పెరిగింది. వెండి కూడా కిలోకు 100 రూపాయలు పెరిగింది. ఈరోజు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 65, 650 రూ. ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర 71, 620రూ. గా ఉంది. ఇక కిలో వెండి 88, 000రూ. లకు చేరింది. అంతా ఫెడ్ రేట్ల దయే.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఈసారి కూడా యథాతథంగా ఉంచింది. ఈ ఏడాదిలో కనీసం 3 సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఫెడ్ సంకేతాలు ఇచ్చింది కానీ యథాతథంగానే ఉంచింది. దీని వలన డాలర్, బాండ్ ఈల్డ్స్ విలువ పడిపోతోంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. ఈ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 2316.40 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 27.22 డాలర్లకు పెరిగింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇప్పుడు రూ. 83.29 రూ.కి దగ్గరగా ఉంది. Also Read:Andhra Pradesh: జనసేనకు పోతిన మహేష్ గుడ్‌బై #gold-rates #silver #fed-rates #gold-price-today #gold-rate-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి